https://oktelugu.com/

Sunny Leone: కానిస్టేబుల్‌ ఉద్యోగానికి అప్లై చేసుకున్న హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌

ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులో పోర్న్‌ స్తార్‌ సన్నీలియోన్‌ ఫొటో కనిపించింది. సన్నీలియోనే దరఖాస్తు చేసుకున్నట్లు ఆమెకు కన్నౌజ్‌లోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్‌ బాలికల కాలేజీని పరీక్ష కేంద్రంగా పేర్కొన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 18, 2024 / 02:38 PM IST
    Follow us on

    Sunny Leone: పరీక్షలు అనగానే అందరికీ గుర్తొచ్చేది హాల్‌టికెట్‌. ఇది లేకుండా ఏ పరీక్ష రాయలేం. అందుకే పరీక్షకు వెళ్లే ముందు అందరూ హాల్‌టికెట్‌ ఉందా అని కొటికి రెండుసార్లు అడుగుతారు. ఇక హాల్‌టికెట్‌ రాగానే ఏమైనా తప్పులు ఉన్నాయా అని చూసుకుంటారు. పొరపాట్లు ఉన్నా పరీక్ష రాయడానికి వీలు ఉండదు. అయితే ఇక్కడ ఓ అభ్యర్థి తనకు వచ్చిన హాల్‌టికెట్‌ చూసి షాక్‌ అయ్యాడు. హాల్‌ టికెట్లపై పొరపాట్లు సాధారణం. కానీ, ఈ పొరపాటు మామూలుగా లేదు. పరీక్ష రాయాల్సిన అభ్యర్థి ప్లేస్‌లో ఏకంగా సినిమాస్టార్‌ ఫొటో ముద్రించి పంపించారు.

    పోర్న్‌ స్టార్‌ ఫొటో..
    ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులో పోర్న్‌ స్తార్‌ సన్నీలియోన్‌ ఫొటో కనిపించింది. సన్నీలియోనే దరఖాస్తు చేసుకున్నట్లు ఆమెకు కన్నౌజ్‌లోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్‌ బాలికల కాలేజీని పరీక్ష కేంద్రంగా పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:05 గంటల వరకు పరీక్ష సమయంగా పేర్కొన్నారు. ఇది చూసి హాల్‌ టికెట్‌ తీసుకోవాలనుకున్న అభ్యర్థి షాక్‌ అయ్యాడు. వెంటనే దానిని ఫొటోతీసి ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

    అధికారుల వివరణ..
    ఈ హాల్‌టికెట్‌ జారీపై యూపీపీఆర్బీ అధికారులు స్పందించారు. పరీక్షకు దరఖాస్తు చేసిన సమయంలోనే తన ఫొటో కాకుండా అభ్యర్థి మరో ఫొటో అప్‌లోడ్‌ చేయడంతోనే ఈ పొరపాటు జరిగిందని తెలిపాడు. దీంతో సన్నీలియోన్‌ పోలీస్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదులను స్వీకరించి తప్పును సరిదిద్దామని వెల్లడించారు.