https://oktelugu.com/

Brother Anil : బ్రదర్ అనిల్ మొదటి భార్యను మీరెప్పుడైనా చూశారా

ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకే తెలియాలి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 18, 2024 / 02:44 PM IST
    Follow us on

    Brother Anil : ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చాయంటే పెద్దగా హడావిడి చేసేవారు కాదు. ఒకటి లేదా రెండు సభల్లో మాత్రమే పాల్గొనేవారు. విధానాల మీదనే విమర్శలు చేసేవారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో వేలు పెట్టేవారు కాదు. అసలు మాట్లాడే వారు కాదు. అందువల్లే రాజకీయాలు అప్పుడు ఒకింత స్వచ్ఛంగా ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్లంతా నాయకులుగా నాడు వెలుగొందారంటే అదే కారణం. పైగా ఇప్పుడున్న స్థాయిలో మీడియా అప్పుడు అంత బలంగా లేదు.. వ్యక్తిగత జీవితాల విషయంలో తొంగి చూసి సోషల్ మీడియా కూడా లేదు. అందుకే జనాలకు కూడా రాజకీయాలంటే ఆసక్తి ఉండేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయాల్లో సొంత కుటుంబ సభ్యులు ఉంటే అడ్డగోలుగా విమర్శించాల్సిన దుస్థితి. కుటుంబంలో జరిగిన విషయాలను బయట పెట్టుకోవాల్సిన ఖర్మ. ఇక పరుష పదజాలానికయితే లెక్కే లేదు.

    ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు రోడ్డున పడుతున్నాయి. మొన్నటిదాకా ఒక నాయకుడి పెళ్లిళ్ల చుట్టూ.. మరో నాయకుడి బాబాయ్ హత్య చుట్టూ..ఇంకో నాయకుడి వెన్నుపోటు రాజకీయాల చుట్టూ తిరిగాయి. కానీ ఎప్పుడైతే వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యారో.. తన అన్నను ఆమె విమర్శిస్తున్నారో.. ఒక్కసారిగా రాజకీయాలు ఆమె వైపు టర్న్ తీసుకున్నాయి. దీంతో వ్యక్తిగత జీవితాలను మీడియా సంస్థలు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాయి. సోషల్ మీడియా జమానా కాబట్టి.. ఇలాంటివి వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమెకు కొండా రాఘవరెడ్డి అండగా ఉన్నారు. అప్పట్లో షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ చివర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె తన అన్న పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో దీన్ని వైసిపి నాయకులు అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ తర్వాత వారు ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.. ఫలితంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఆమె భర్త అనిల్ కు సంబంధించిన వ్యవహారాలు కూడా తెర పైన కనిపిస్తున్నాయి.

    వాస్తవానికి బ్రదర్ అనిల్ కుమార్ కు గతంలోనే పెళ్లయింది. షర్మిలకు కూడా ఇదివరకే ఒక వివాహం జరిగింది. వారిద్దరికీ ఇది రెండో పెళ్లి. వారి దాంపత్య జీవితంలో రాజారెడ్డి, అంజలి అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ కొండా రాఘవరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తే పలు కీలక విషయాలు చెప్పారు.”వైయస్ షర్మిలకు విపరీతమైన మనస్తత్వం ఉంటుంది. పెళ్లి నుంచి రాజకీయాల వరకు అన్ని విషయాల్లో ఆమె వ్యవహార శైలి అలానే ఉంటుంది. అప్పట్లో ఆమె పార్టీ ప్రారంభించినప్పుడు నాయకులందరినీ ఏకవచనంతో సంబోధించేవారు. పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆమెకు తెలిసేది కాదు. ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో కూడా తెలిసేది కాదు. చివరికి ఆమె భర్త అనిల్ కుమార్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఆమె ఇప్పటికీ హైదరాబాదులోని అంబర్ పేట లో నివాసం ఉంటోంది. ఆమె దగ్గరికి అనిల్ కుమార్ అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటారు. ఈ విషయం షర్మిలకు కూడా తెలుసు. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినప్పటికీ అనిల్ కుమార్ ను షర్మిల పెళ్లి చేసుకుంది. షర్మిలకు ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె అన్నిటినీ భరించాల్సి ఉంటుందని” రాఘవ రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, ఆ యూట్యూబ్ ఛానల్ లో రాఘవరెడ్డిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న స్క్రీన్ లో అనిల్ కుమార్ మొదటి భార్య, ఆమె కూతురు ఫోటో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై అటు వైసిపి అనుకూల నాయకులు, ఇటు కాంగ్రెస్ అనుకూల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు..కాగా, ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో ఆ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకే తెలియాలి.