Summer Holidays 2023: స్కూలు బంద్ కాగానే ఏం ఉత్సాహం రా బుడ్డోడా?

పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఏడాదిగా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఇప్పుడు ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఆటపాటల్లో తమ క్రికేటివిటీని బయట పెడుతున్నారు. చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌ గేమ్స్‌తోనే గడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : April 27, 2023 4:35 pm
Follow us on

Summer Holidays 2023: టాలెంట్‌ ఎడబ్బ సొత్తు కాదు.. ఈ విషయాన్ని ఓ సినీ గేయ రచయిత పచ్చిగా చెప్పాడు. వాస్తవం కూడా అదే. టాలెంట్‌ విషయంలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అని తేడాలేదు. ఎవడి ఆలోచన వాడిది.. ఎవడి క్రికేటివిటీ వాడిది. ఎవరో ఏదో అనుకుంటారని క్రికేటివిటీని దాచిపెడితే అలాగే ఉండిపోతారు. ఎవరేమనుకుంటే మనకేంటి.. ఏదైతే అదైతది అని క్రికేటివిటీని రివీల్‌ చేస్తే మన టాలెంట్‌కు గుర్తింపు లభిస్తుంది. ఇలాగే ఓ బుడ్డోతు తన టాలెంట్‌ను బయట పెట్టి వావ్‌ అనిపిస్తున్నాడు.

వేసవి సెలవుల్లో..
పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఏడాదిగా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఇప్పుడు ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఆటపాటల్లో తమ క్రికేటివిటీని బయట పెడుతున్నారు. చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌ గేమ్స్‌తోనే గడుతున్నారు. కొంతమంది పిల్లలు తమ అమ్మమ్మ, నానమ్మ ఊళ్లకు వెళ్లి పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక గ్రామీణ పిల్లలు తమ టాలెంట్‌ను ఆటపాటలతో బయటపెడుతున్నారు.

బుడతడి కప్పగెంతులు..
ఓ బుడతడు క్యాప్‌ ఉన్న షర్లు వేసుకుని.. కప్పగంతులు వేస్తూ వీడియో తీసుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం షర్లుకు ఉన్న క్యాప్‌ తలపై పెట్టుకుని కాళ్లు కొద్దిగా వంచి, చేతి వేళ్లలను తెరిచి.. ఎండలో నిలబడి గెంతులు వేశాడు. ఈ సందర్భంగా కింద అతడి నీడ పూర్తిగా కప్పలా కనిపిస్తోంది. ఈ వీడియోకు కప్ప అరుపు శబ్దాలను జోడించిన బుడతడు సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇంకేముందు లైకులే లైకులు.. కామెంట్లే కామెంట్లు..

మెచ్చుకుంటున్న నెటిజన్లు..
ఈ బుడ్డోడి టాలెంట్‌ చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. నువ్వరా అసలు క్రికేటర్‌వి అని.. నువ్వు మామూలోడివి కాదురా.. అని కొంతమంది కామెంట్‌ చేస్తుంటే.. నీ టాలెంట్‌ సూపర్‌ చిన్నా.. నువ్వ తోపురా చిన్నోడా.. దూసుకుపోరా చంటోడా అంటూ ఎంకరేజ్‌ చేస్తున్నాడు. ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తే పిల్లల్లో క్రికేటివిటీని బయటకు తీయొచ్చని మరికొంత మంది పేరెంట్స్‌కు సూచనలు చేస్తున్నారు.