Homeఎంటర్టైన్మెంట్Virupaksha Collections: 'విరూపాక్ష' మొదటి వారం వసూళ్లు.. వంద కోట్ల రూపాయిల వైపు పరుగులు!

Virupaksha Collections: ‘విరూపాక్ష’ మొదటి వారం వసూళ్లు.. వంద కోట్ల రూపాయిల వైపు పరుగులు!

Virupaksha Collections: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ మెగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని కలిగించింది. సాయి ధరమ్ తేజ్ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోబోతుంది అనే ఫీలింగ్ ని రప్పించింది ఈ చిత్రం. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు అయితే ఉన్నాయో, ఆ అంచనాలను అన్నీ దాటి వేసి ఈ చిత్రం ప్రేక్షకులకు థియేటర్స్ లో అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చింది.

సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సన్నివేశాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.డైరెక్టర్ కార్తీక్ దండు స్టోరీ మరియు టేకింగ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే ఎంత అద్భుతంగా కుదురిందో మాటల్లో చెప్పలేము. ఈ చిత్రం విడుదలై నేటికీ వారం రోజులు అయ్యింది. ఈ వారం రోజులకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘ప్రతి రోజు పండగే’.ఈ సినిమా అప్పట్లో 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రం ఆ వసూళ్లకు మొదటివారం లోనే దగ్గరగా వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం మొదటి వారం 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించిందట.అలా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 7 రోజుల్లో 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే ఈ సినిమా 1 మిలియన్ మార్కుని దాటేసింది, ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొట్టమొదటి మిలియన్ మార్కు దాటిన సినిమాగా చెప్పుకోవచ్చు, అలా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి ఈ చిత్రం రెండు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారం లో 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version