
Allu Arjun- Sukumar: అల్లు అర్జున్ ని ఇష్టపడే దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే సుకుమార్ ఆయన్ని ప్రేమిస్తారు. బన్నీ-సుకుమార్ లకు విడదీయరాని బంధం ఉంది. వీరిద్దరి కెరీర్స్ దాదాపు ఒకే సమయంలో మొదలయ్యాయి. ఇద్దరికీ బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటే. ఆర్య మూవీతో అల్లు అర్జున్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఆర్య తో సుకుమార్ డైరెక్టర్ గా మారారు. బన్నీకి ఆర్య యూత్ లో పాపులారిటీ తెచ్చింది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని సుకుమార్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన ఘనత సుకుమార్ దే. వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2, పుష్ప తెరకెక్కాయి. పుష్ప 2 నాలుగో చిత్రం. సుకుమార్ తన కెరీర్లో అత్యధికంగా అల్లు అర్జున్ తో చిత్రాలు చేశారు. పుష్పతో ఇండియాను షేక్ చేసిన డుయో… సీక్వెల్ తో వరల్డ్ వైడ్ మోత మోగించాలని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన టీజర్ ఆకట్టుకోగా… వందల కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
అల్లు అర్జున్ మీదున్న అభిమానం, ప్రేమ కలగలిపి ఆయనకు పుష్ప 2 రూపంలో మరో పాన్ ఇండియా హిట్ ఇస్తున్నాడనిపిస్తుంది. అల్లు అర్జున్ ని సుకుమార్ అభిమానించడానికి మరొక కారణం కూడా ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ ప్రాణాలు కాపాడట. రియల్ హీరో మాదిరి సాహసం చేశాడట. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా వెల్లడించారు.

నేను నీళ్లలో మునిగిపోతున్నాను. అందరూ అలానే చూస్తున్నారు. నేను కొట్టుకుపోతున్నా, నాకు అర్థం అవుతుంది. అప్పుడు బన్నీ జంప్ చేసి నీళ్ళలోకి దూకాడు. నన్ను పైకి లేపాడు. నేను స్వార్థంతో తనని క్రిందకు లాగుతున్నాను. ఇద్దరం మునిగిపోతున్నాము. అప్పుడు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి కాపాడారు. ఆ రోజు నాకు ప్రాణదానం చేసిన దేవుడు అల్లు అర్జున్. ఇది జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని సుకుమార్ చెప్పారు. ఈ మాటలు చెబుతూ ఆయన కృతజ్ఞతా భావం కనబరిచారు. ఎమోషనల్ అయ్యారు. బన్నీ సినిమా చిత్రీకరణ సమయంలో ఇది జరిగినట్లు సమాచారం.