
Good Sleep : మనిషి ఆరోగ్యానికి సరైన నిద్ర అవసరం. ఇప్పుడున్న బిజీ వాతావరణంలో కంటినిండా నిద్రపోయేవారు చాలా తక్కువే. విద్యార్థులు చదువు ఒత్తిడి కారణంగా, యువకులు మొబైల్ వాడడంతో, ఉద్యోగం చేసేవారు రకరకాల స్ట్రెష్ తో కునుకు తీయడం కరువవుతోంది. దీంతో చిన్న వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయి. నిద్ర సరిగా లేకపోవడంతో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేని వారు ఒత్తిడికి గురైన బీపీ, షుగర్ వ్యాధులు కూడా సంక్రమించే ఆస్కారం ఉందని చెబుతున్నారు. అయితే ఎంత బిజీ లైఫ్ ఉన్నా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. బీజీ లైఫ్ తో పాటు ఆహారపు అలవాట్లు కూడా నిద్రలేమి సమస్యలకు కారణమవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలోకి జారుకుంటారని అంటున్నారు.

పెరుగుతో కూడిన ఆహారం:
ప్రతిరోజూ తినే భోజనంలో పెరుగు ఉండేలా చూసుకోండి. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి నిద్రలోకి జారుకునేందుకు ఉపకరిస్తాయి. పెరుగుతో భోజనం చేస్తేనే సంపూర్ణం అని కొందరు భావిస్తారు. పెరుగు లేకుండా ఆహారం తీసుకోరు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును తక్కువే వాడాలి. కానీ సాధ్యమైనంత వరకు పెరుగుతో కూడిన భోజనం చేస్తే నిద్రలేమి సమస్యకు దూరమవుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
అరటిపండ్లు:
తిన్న ఆహారం జీర్ణమవడానికి అటిటిపండ్లు ఎంతో ఉపయోగపడుతాయి. అరటిపండులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటు పొటాషియం, సూక్ష్మ పోషకాలు విరివిగా ఉంటాయి. ఇవి మనిషిలో నిద్రపోయేందుకు తోడ్పడుతాయి. అందువల్ల నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటిపండ్లను తీసుకోవాలని చెబుతున్నారు.
ఆకుకూరలు:
ఆకుకూరల్లో అనేక పోషకాలులభిస్తాయి. ముఖ్యంగా కొన్ని ఆకుకూరల్లోఐరన్ విపరీతంగా ఉంటుంది. ఇది శరీరానికి కావాలినంత అందిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరీయవు.
చెర్రిపండ్లు:
చెర్రీ పండ్లల్లో మెలటోనిన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. కొందరు నేరుగా తీసుకోవడానికి ఇబ్బంది పడితే జ్యూస్ చేసైనా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
బాదం:
బాదంలో ఉండే మెగ్నీషియం నిద్రపోవడానికి బాగా ఉపయోగపడుతుంది.ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుంది.
చేపలు:
చేపల్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చేపలను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో నిద్రలోకి జారుకుంటారు.