
Sudigali Sudheer: బుల్లితెర పవర్ స్టార్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు సుడిగాలి సుధీర్.జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పరిచయమైనా సుడిగాలి సుధీర్, తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.ఈయనకి ఉన్న క్రేజ్ ని చూసి చూస్తే ఎవరైనా షాక్ కి గురి అవ్వాల్సిందే.అందుకే ఆయనని అందరూ బుల్లితెర పవర్ స్టార్ అని పిలుస్తుంటారు.
అయితే రీసెంట్ గా ఆయన కమెడియన్ నుండి హీరో గా మారిన సంగతి తెలిసిందే.ఆయన హీరోగా నటించిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మరియు ‘ 3 మంకీస్’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ, మూడవ సినిమా ‘గాలోడు’ మాత్రం కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.కేవలం రెండు కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా సుమారుగా 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

ఇక ఈ చిత్రం సక్సెస్ తర్వాత సుధీర్ సైలెంట్ అయ్యిపోయాడేంటి అని అభిమానులందరూ అనుకుంటున్న సమయం లో నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా లోడింగ్ అంటూ ఆయన డబ్బింగ్ చెప్తున్న ఫోటోని విడుదల చేసారు.ఇది చూసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు.ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట.
ఈ సినిమా తో ఆయన తన రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.మరోపక్క సుధీర్ బుల్లితెర మీద కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, వచ్చే వారం ప్రసారం కాబొయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో సుధీర్ తళుక్కుమని మెరిశాడు.ఇక నుండి ఆయన రెగ్యులర్ గా ప్రతీ ఆదివారం ఈ షో లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది.ఈ షో తో పాటుగా ఢీ మరియు జబర్దస్త్ షోస్ లో కూడా ఇక నుండి యాక్టీవ్ గా పాల్గొంటాడని టాక్.