Comedy Stock Exchange : సుడిగాలి సుధీర్ తో అల్లు అరవింద్ ఓ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది . దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సుధీర్ యాంకర్ గా ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ పేరుతో షో ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సుడిగాలి సుధీర్ తో పాటు యంగ్ యాంకర్ దీపికా పిల్లి ఈ షోలో భాగమయ్యారు. ఇక స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షో జడ్జిగా వ్యవహరించడం విశేషం. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్స్ ఈ ఓటీటీ కామెడీ షో టీమ్ లీడర్స్ గా వచ్చారు.

ముక్కు అవినాష్, వేణు, యాదమ్మ రాజు, సద్దాం, భాస్కర్, హరి, జ్ఞానేశ్వర్ టీమ్ లీడర్స్ గా ఉండనున్నారు. డిసెంబర్ 2 నుండి ఈ కామెడీ షో ఆహాలో స్ట్రీమ్ కానుంది. ప్రేక్షకులే టీమ్స్ కి మార్క్స్ ఇవ్వడం ఈ షో విశేషం. అందరి పెర్ఫార్మన్స్ చూశాక ఎపిసోడ్ విన్నర్ ఎవరనేది ప్రేక్షకులే తేల్చుతారు. ప్రోమో అంచనాలు పెంచేయగా ఆహా ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక జబర్దస్త్ కి పోటీగా అనేక కామెడీ షోలు వచ్చాయి. స్టార్ మా, జీ 5… కామెడీ స్టార్స్, అదుర్స్ వంటి కామెడీ షోలు చేయడం జరిగింది. మాజీ జబర్దస్త్ కమెడియన్స్ చేసినప్పటికీ ఆ షోస్ సక్సెస్ కాలేదు. క్రింద పడ్డా మీదా పడ్డా జబర్దస్త్ ని బీట్ చేసే షో రాలేదు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, అనసూయ, రోజా వివిధ కారణాలతో షో నుండి తప్పుకున్నారు. దీంతో టీఆర్పీ తగ్గిందనే కథనాలు వెలువడ్డాయి.
హైపర్ ఆది, గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సుధీర్ సైతం తిరిగి జబర్దస్త్ కి వస్తున్నట్లు ప్రకటించారు. మల్లెమాల సంస్థతో ఎలాంటి విబేధాలు లేవన్న సుధీర్… వారి అనుమతితోనే విరామం తీసుకున్నాను అన్నారు. త్వరలో జబర్దస్త్ కి నా రీఎంట్రీ ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో జబర్దస్త్ కి కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పోటీ ఇవ్వగలదా లేదా అనేది చూడాలి. అల్లు అరవింద్ నేతృత్వంలో ఆహా ఊహకు మించి దూసుకెళుతుంది. బాలయ్య హోస్ట్ గా సాగుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.