
Shah Rukh Khan- Allu Arjun: సినిమా సినిమాకి తన స్టార్ స్టేటస్ ని పెంచుకుంటూ నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా అవతరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ యూత్ మొత్తానికి ఎంతో ఆదర్శం.ప్రస్తుతం ఆయన రేంజ్ పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది, పుష్ప సినిమా మ్యానియా తో ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులను ఒక ఊపు ఊపేసాడు.
Also Read: Jagapathi Babu: ఏకంగా రూ.1000 కోట్ల ఆస్థి పోగొట్టుకున్న జగపతిబాబు… కారణం అదేనట!
బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి అక్కడి స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ మరియు ఫాలోయింగ్ రావడంతో,ఆయన క్రేజ్ ని అక్కడి బడా స్టార్ హీరోలు సైతం ఉపయోగించుకుంటున్నారు.రీసెంట్ గా ప్రముఖ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం తాను షారుఖ్ ఖాన్ తో తీస్తున్న ‘జవాన్’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అడిగాడట.కథ మరియు తన పాత్ర నచ్చడం తో అల్లు అర్జున్ ఇందులో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు సమాచారం.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకి రానుంది.ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్న అల్లు అర్జున్, తదుపరి షెడ్యూల్ తర్వాత వచ్చే బ్రేక్ లో ‘జవాన్’ కోసం డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా తన సినిమాకి అల్లు అర్జున్ బాగా ప్లస్ అవుతాడని భావిస్తున్నాడు అంటే అల్లు అర్జున్ రేంజ్ ప్రస్తుతం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..షారుఖ్ ఖాన్ కూడా తన మార్కెట్ ని సౌత్ లో విస్తరింపచేసుకోవడానికి చాలా సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

కానీ సరైన హిట్ తగలడం లేదు, రీసెంట్ గా విడుదలైన పఠాన్ చిత్రం హిందీ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్టై వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్నప్పటికీ సౌత్ లో పెద్దగా వసూళ్లు రాలేదు,అల్లు అర్జున్ లాంటి క్రేజీ స్టార్ ని తన సినిమాలో పెట్టుకుంటే కచ్చితంగా ఇక్కడ మార్కెట్ కలిసి వస్తుందని ఆయన అంచనా..చూడాలి మరి షారుక్ ఖాన్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో అనేది.