
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..ప్రారంభించిన ప్రతీ సీజన్ ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవ్వడం తో ఓటీటీ వెర్షన్ సీజన్ కూడా చేసారు.అది కూడా పెద్ద హిట్ అయ్యింది,కానీ గత ఏడాది ప్రసారమైన సీజన్ 6 మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.కంటెస్టెంట్స్ ని అన్యాయం గా ఎలిమినేషన్స్ చెయ్యడమే అందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
Also Read: Shah Rukh Khan- Allu Arjun: బ్రేకింగ్ : షారుక్ ఖాన్ ‘జవాన్’ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
అందుకే ఈసారి రొటీన్ కి బిన్నంగా పెళ్ళైన జంటలతో సీజన్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట.ఇప్పటికే ఇందుకోసం పలు జంటలను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.మరో విశేషం ఏమిటంటే ఈ సీజన్ లో విడిపోయిన జంటలను కూడా షో లో పార్టిసిపేట్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.ఇదే ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న ప్రముఖ సింగర్ మరియు నటుడు నోయల్ ఈ సీజన్ లో కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం.ఆ సీజన్ లో ఈయనకి అనారోగ్యం కారణం గా బయటకి వెళ్లిపోవాల్సి వచ్చింది..అయితే నోయల్ కి ప్రముఖ హీరోయిన్ ఈస్టర్ తో వివాహం జరిగి ఆ తర్వాత కొనేళ్లకు విడిపోవాల్సి వచ్చింది.ఇప్పుడు ఈ ఇద్దరినీ బిగ్ బాస్ టీం సరికొత్త సీజన్ లో పాల్గొనాల్సింది గా రిక్వెస్ట్ చేసిందట.దీనికి వీళ్లిద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ ఆలోచించని విధంగా ఈసారి మన బిగ్ బాస్ టీం ఆలోచించింది.సక్సెస్ అయితే ఇతర బాషలలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోస్ లో కూడా ఈ ఫార్ములా ని ఫాలో అయ్యే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా మూడవ సీజన్ నుండి ఆరవ సీజన్ వరకు అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు, అయితే సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఇక నేను హోస్ట్ గా ఉండను అంటూ బిగ్ బాస్ టీం కి చెప్పేశాడట నాగార్జున.ఆయన స్థానం లోకి నందమూరి బాలకృష్ణ, లేదా విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది.
Also Read:Jagapathi Babu: ఏకంగా రూ.1000 కోట్ల ఆస్థి పోగొట్టుకున్న జగపతిబాబు… కారణం అదేనట!