Waltair Veerayya- Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..చిరంజీవి నుండి అభిమానులు ఇంతకాలం ఎలాంటి సినిమాని అయితే కోరుకున్నారో..అలాంటి సినిమానే ఇచ్చేసాడు డైరెక్టర్ బాబీ..మెగాస్టార్ ని కం బ్యాక్ తర్వాత ఇలా పూర్తి స్థాయిలో వాడుకున్న డైరెక్టర్ బాబీ మాత్రమేనని చెప్పుకుంటున్నారు అభిమానులు.

టైటిల్ కార్డు దగ్గర నుండి ఎండ్ కార్డ్స్ పడేవరకు ప్రతీ ఒక్కటి వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి మార్కు కనపడేలా ఈ సినిమాని అభిమానులకు ఒక బహుమతి లాగ ప్రెజెంట్ చేసాడు..ఇక సెకండ్ హాఫ్ లో మాస్ మహారాజ రవితేజ మరియు చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు బాగా రక్తికట్టించాయి..వీళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు ఫ్యాన్స్ కంటతడి పెట్టుకోక తప్పదు..అంతే అద్భుతంగా డైరెక్టర్ తెరకెక్కించాడు.

ఇది ఇలా ఉండగా ఈరోజు ఈ సినిమాని ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడడం కోసం ప్రముఖ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రసాద్ మల్టిప్లెక్స్ కి విచ్చేశాడు..అల్లు అర్జున్ కి తన మామయ్య చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..కట్టెకాలే వరకు నేను చిరంజీవి ఫ్యాన్ గానే ఉంటాను అని ఆయన ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

నేడు చిన్నప్పటి నుండి తాను చూసిన వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని ఆడియన్స్ మధ్యలో కూర్చొని, ఆ విజిల్స్ మరియు చప్పట్లను ఎంజాయ్ చేస్తూ వీక్షించాడు..దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అల్లు అర్జున్ గతం లో కూడా ఇలా ప్రసాద్ మల్టిప్లెక్స్ మరియు ‘AMB సినిమాస్’ లో చాలా సినిమాలు చూసాడు..భీమ్లా నాయక్ సినిమాని కూడా ఆయన గతం లో ‘AMB సినిమాస్’ లో చూసాడు.