Troll Of The Day: పసుపు కుంకుమ, నీరు చెట్టు, జన్మ భూమి… ఇన్నేసి పథకాలు ప్రవేశపెట్టినా… పచ్చ మీడియాలో పేజీల కొద్దీ యాడ్స్ కుమ్మేసినా చంద్రబాబు 23 వద్దే ఆగిపోయాడు. పాపం మళ్ళీ ఇప్పుడు లేచేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సరే ఇవి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో తెలియదు కానీ… ఇప్పుడైతే పచ్చ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న తీరు మామూలుగా లేదు. ఇది ఒక్కో సారి భూమారాంగ్ అవుతోంది.

ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వెంకటకృష్ణ ఒక డిబేట్ పెట్టాడు. దీనికి టిడిపి దళిత విభాగం నుంచి ఓ నాయకుడు హాజరయ్యారు.. జగన్ పాలన మీద విమర్శలు చేసే క్రమంలో. . ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే… పోలీస్ అధికారి బదిలీకి సంబంధించి లంచం తీసుకున్నాడని, తర్వాత జగన్ రంగంలోకి దిగి ఆ లంచం తిరిగి పోలీస్ అధికారికి ఇప్పించి, ఆ ఎమ్మెల్యేతో సారీ చెప్పించాడని వివరించాడు.. మెడకాయ మీద తలకాయి… అందులో మెదడు ఉన్న ఎవరికైనా ఇందులో తప్పు ఏముంది అనిపిస్తుంది.. కానీ టిడిపి నాయకులకు ఇందులో తప్పు కనిపిస్తుంది.. ఎందుకంటే లంచం అనేది వారికి అవసరం కాబట్టి.. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసింది అదే కాబట్టి..
తీరు మారదా
టిడిపి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా లంచాలు మేశారు.. ప్రభుత్వ పథకాల్లో ఇష్టానుసారంగా కమిషన్లు దండుకున్నారు.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపులోనూ చేతివాటం ప్రదర్శించారు.. కానీ ఈ విషయాన్ని పచ్చ మీడియా ఎప్పటికీ చెప్పదు.. పైగా పక్కా భవనం కూడా లేని రాజధానిని ప్రపంచానికే తలమానికం అంటూ ప్రచారం చేస్తుంది..
అర్హత కూడా లేదు
ప్రతిసారి ఇతరుల జీవితాల్లో భూతద్దాలు పెట్టి వెతికి చూసే పచ్చ మీడియా… తన కింది నలుపుని మాత్రం చూసుకోదు.. డిబేట్ నిర్వహించే సమయంలోనూ కేవలం తన ఫోల్డ్ లో ఉన్న నాయకులను మాత్రమే పిలుస్తుంది..ఆఫ్ కోర్స్ అన్ని మీడియా సంస్థలు ఇలానే చేస్తున్నాయి. ఇందులో పచ్చ మీడియాది మాత్రం అందె వేసిన చేయి. అందులో వెంకటకృష్ణ అయితే నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు.