Daughters: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కు ఇది గొప్ప న్యూస్

ఆడపిల్ల అనగానే గుండెలపై భారం అని చాలా మంది అనుకుంటారు. కానీ నేటి కాలంలో పురుషులతో సమానంగా ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగవాళ్ల కంటే ఆడవాళ్లే చదువులో రాణిస్తూ వివిధ రంగాల్లో ముందుంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : October 11, 2023 5:14 pm

Daughters:

Follow us on

Daughters: కంటే కూతుర్ని కనాలి.. అని ఎంత మంది చెప్పినా ఇప్పటికీ కొన్ని కుటుంబాలు అడపిల్ల పుడితే బోరున విలపిస్తారు. కొడుకు కోసం కోటి విద్యలు చేస్తారు. అయితే కొడుకు కంటే కూతురే కుటుంబంపై ఎక్కువ ప్రేమ చూపుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు వెల్లడయ్యాయి. తాజాగా నిర్వహించిన మరో అధ్యయనంలో కూతుళ్ల తో తండ్రి ఆయుష్సు పెరుగుతుందని తేలింది. కూతురు ఉన్న తండ్రి 74 వారాలు అదనంగా జీవిస్తారట. కానీ ఇదే సమయంలో తల్లిపై ప్రభావం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆడపిల్ల అనగానే గుండెలపై భారం అని చాలా మంది అనుకుంటారు. కానీ నేటి కాలంలో పురుషులతో సమానంగా ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగవాళ్ల కంటే ఆడవాళ్లే చదువులో రాణిస్తూ వివిధ రంగాల్లో ముందుంటున్నారు. ఉద్యోగంలో, వ్యాపారంలోనే కాకుండా శాస్త్రవేత్తలుగా మారి దేశాలకు ప్రతిష్ట తీసుకొస్తున్నారు. అయినా కొందరు తల్లిదండ్రులు ఆడిపిల్లలు అనగానే భయపడిపోతుంటారు. కానీ ఈ భయమే వారి ఆయుష్సు పెంచుతుందని అంటున్నారు.

జాగిలోయిన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ 2,147 మంది తల్లలు, 2,163 తండ్రల జీవిత కాల డేటాను సేకరించారు. తండ్రుల దీర్ఘాయుష్సు విషయంలో కొడుకులు, కూతుళ్లు ఉన్నవాళ్లపై రీసెర్చ్ చేశారు. కొడుకులు ఉండి కూతుళ్లు లేని తండ్రుల జీవితాలు వారితో ఎలాంటి ప్రభావానికి గురికాలేదు. కానీ కూతుళ్లు ఉన్న తండ్రుల్లో దీర్ఘాయుష్సు పెరిగినట్లు గమనించారు. కూతుళ్లు ఉన్న తండ్రులు నిత్యం సంతోషంగా ఉంటారని వీరి పరిశోధనల్లో తేలింది. మిగతా వారికంటే కూతుళ్లు ఉన్న తండ్రుల జీవితం 74 వారాలు అధికంగా పెరుగుతుందని తేల్చారు.

తండ్రులపై కొడుకుల కంటే కూతుళ్లే ఎక్కువగా ప్రేమ చూపుతారని, ఈ నేపథ్యంలో వారితో ఎంతో ఉల్లాసంగా ఉంటారని వీరు పేర్కొన్నారు. దీంతో తండ్రుల ఆయుష్సు పెరగుతుందని అన్నారు. అయితే కూతుళ్ల తో తల్లుల ప్రభావాన్ని చూసినప్పుడు వారి జీవితకాలంలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. పైగా వారి జీవిత కాలం తగ్గే అవకాశం ఉందని తేల్చారు. అయితే అంతకుముందు నిర్వహించిన పరిశోధనల్లో తల్లి, తండ్రి అని కాకుండా ఇద్దరిలో ఎవరిపై ఎక్కువ ప్రేమను కలిగి ఉంటే వారు సంతోషంగా ఉంటారని తెలిపారు.