Homeట్రెండింగ్ న్యూస్Stray Dogs: గ్రామ సింహాల పేరిట రూ.90 కోట్లు.. సేవలో తరిస్తున్న గ్రామస్తులు!

Stray Dogs: గ్రామ సింహాల పేరిట రూ.90 కోట్లు.. సేవలో తరిస్తున్న గ్రామస్తులు!

Stray Dogs: కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినా దాని బుద్ది మారదు.. అన్నాడు యోగి వేమన. శునకాలు, శునకపు బుద్ధి ఉన్నవారి గురించి ఆయన ఇలా అభివర్ణించాడు. ఇక శునకాలను గ్రామ సింహాలుగా కూడా వర్ణిస్తున్నాం. ఎందుకంటే.. ప్రజలకు విశ్వాసంగా ఉంటూ.. గ్రామాలకు కాపలాగా ఉంటున్నాయి. దీంతో శునకాలను సింహాలతో పోల్చుతున్నాయి. అయితే మారుతున్న పరిస్థితులతో శునకాల ప్రవర్తనలోనూ మార్పులు వస్తున్నాయి. మనుశులనే శత్రువులుగా చూస్తున్నాయి. దీంతో విశ్వాసకరమైన శునకాలను మనుషులు కూడా శత్రువుల్లా చూస్తున్నారు. ఇక వీధి కుక్కల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాతావరణ మార్పులు.. తింటున్న ఆహారం, కాలుష్యం, సౌండ్‌ పొల్యూషన్‌ తదితర కారణాలతో వీధికుక్కల ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. మనుషులపై దాడికి తెగిస్తున్నాయి. దీంతో మనుషులు శునకాలను నిర్మూలించాలంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. ఆ ఊరిలో మాత్రం కుక్కలకు రాచమర్యాదలు చేస్తున్నారు. గ్రామస్తులు శునకాల సేవలో తరిస్తున్నారు. అది ఎక్కడ.. ఎందుకు అలా చేస్తున్నారో తెలుసుకుందాం.

ఆ వీధికుక్కల పేరిట కోట్ల ఆస్తులు..
గ్రామంలోని విధి కుక్కలు కోట్లకు పడగలెత్తాయి. ఏకంగా రూ.90 కోట్ల ఆస్తికి హక్కుదారులయ్యాయి. వాటి ఆస్తి నిర్వహణకు ఓ ట్రస్టు కూడా ఉంది. దీంతో ఆ గ్రామసింహాల లైఫ్‌స్టైలే మారిపోయింది. పెంపుడు కుక్కలు కూడా అసూయ పడేస్థాయిలో అవి రాజభోగాలు అనుభవిస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం.

శునకాల సేవలో గ్రామస్తులు..
గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఇందుకు వేదిక అయ్యింది. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని జిల్లాలోని పంచోత్‌ గ్రామ ప్రజల బలమైన విశ్వాసం. దీంతో నిత్యం కళ్లెదురుగా ఉండే వీధి కుక్కలకే సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు. వాటి కోసం ఓ ట్రస్ట్‌ ఏర్పాటు భారీ మొత్తాలను విరాళంగా ఇవ్వడం మొదలెట్టారు. కొందరు ఏకంగా కోట్ల రూపాయల విలువైన తమ ఆస్తులనే ఆ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. ఇలా పోగైన ఆస్తులు రూ.90 కోట్లకు చేరాయి.

భారీ యంత్రాంగం..
ఇక కుక్కల సేవ కోసం భారీ యంత్రాంగమే ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ శునకానికి ఆహారం తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. వారు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. శునకాలు అనారోగ్యం పాలైతే వెంటనే వైద్యం అందించేందుకు ఓ పశు వైద్యుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ శునకాలు నిజంగానే లక్కీ కదూ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular