New Year Celebrations: కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ న్యూయర్ రోజు కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో ఆనందంగా కొందరు జరుపుకుంటారు. మరికొందరు ఇంట్లో ఉన్న పాత వస్తువులను పడేసి కొత్త వస్తువులను తీసుకొస్తుంటారు. ఇంకా కొందరు పార్టీలు, డ్యాన్సులు, కేక్ కటింగ్ అంటూ ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు న్యూఇయర్‌ను జరుపుకుంటాయి. అయితే ఒక్కో దేశానికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. వాటి బట్టే కొన్ని దేశాలు వింతగా న్యూ ఇయర్‌ను జరుపుకుంటాయి. ఇండియాలో అయితే ఉగాదిని కొత్త సంవత్సరంగా భావిస్తారు. కానీ దేశంలో ఈ ఇంగ్లీషు క్యాలెండర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు న్యూ ఇయర్‌ను వింతంగా సెలబ్రేట్ చేసుకుంటాయి. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డెన్మార్క్
డెన్మార్క్‌లోని ప్రజలు ఇంటి తలుపుల దగ్గర పాత ప్లేట్లు, గ్లాసులు అన్ని విసిరి న్యూ ఇయర్‌ను జరుపుకుంటాయి. ఇలా చేసి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం వల్ల మీలో ఉండే చెడు ఆత్మలు అన్ని కూడా పారిపోతాయని నమ్ముతారు. ఎవరి ఇంటి దగ్గర అయితే ఎక్కువ విరిగిన పాత్రలు ఉంటే.. వారికి అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు.
బ్రెజిల్
కొత్త సంవత్సర వేడుకలను బ్రెజిల్‌లో డిఫరెంట్‌గా చేస్తారు. ఇక్కడి ప్రజలు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకమైన లో దుస్తులు ధరిస్తారట. ఇలా చేయడం వల్ల కొత్త సంవత్సరంలో వారికి అదృష్టం వస్తుందని నమ్ముతారు.
ఫిన్లాండ్
ఫిన్లాండ్ ప్రజలు కరిగిన టిన్‌ను నీటిలో ముంచుతారు. ఆ లోహం గట్టిపడిన తర్వాత దానితో ఉంగరం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వివాహం జరుగుతుందని నమ్ముతారు.
పెరూ
ఈ దేశంలో కొత్త సంవత్సర వేడుకలు చాలా డిఫరెంట్‌గా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే పెరువియన్ పండుగలో ప్రజలు అందరూ కూడా లాంతర్లు పట్టుకుంటారు. ఇది కొత్త ఏడాదిలో అంతా మంచి జరగడానికి ఒక చిహ్నంగా భావిస్తారు.
స్పెయిన్
ఈ దేశంలో కొత్త సంవత్సరం రోజు ఓ విచిత్రమైన సంప్రదాయం పాటిస్తారు. న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లు తింటారు. ఇలా తినడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. మొత్తం 12 నెలలు ఉండటం వల్ల ఒక్కో నెలకి ఒక్కో ద్రాక్ష పండు చొప్పున 12 ద్రాక్షలు తింటారు.
ఈక్వెడారియన్లు
గతేడాది జరిగిన చెడు, దురదృష్టాన్ని చెరిపేయాలని ఈక్వెడారియన్లు నూతన సంవత్సర రోజు విచిత్రమైన సంప్రదాయం పాటిస్తారు. న్యూ ఇయర్ అర్ధరాత్రి సగ్గుబియ్యం కాగితపు బొమ్మలు తయారు చేసి కాల్చుతారు. ఇలా చేయడం వల్ల చెడు అంతా పోయి జీవితంలో మంచి జరుగుతుందని భావిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.