Tribal Marriage in Jharkhand: మన దేశంలో ఆచార సంప్రదాయాలు ఎన్నో ఉంటాయి. కొన్ని విచిత్రంగా ఉంటాయి. కొన్ని వింతగా తోస్తాయి. పుర్రెకో గుణం జిహ్వకో రుచి అన్నట్లుగా మన ఆచార వ్యవహారాల్లో కూడా విచిత్రమైన ఆచారాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఓ విచిత్రమైన ఆచారం గురించి తెలుసుకుందాం. దేశంలో ఎన్నో ఆచారాలు ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని మనకు తెలిసినవి ఉన్నా కొన్నింటిని మనం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. జార్ఖండ్ లోని గిరిజనుల్లో ఉన్న ఆచార వ్యవహారం గురించి వింటేనే మనకు ఆశ్చర్యం కలగక మానదు. కానీ అది వారి ఆచారం అని సరిపెట్టుకోవాల్సిందే. దీంతో దేశంలోని ఆచార వ్యవహారాల గురించి చర్చించుకోవడం కూడా ఆశ్చర్యమే.

అక్కడ గిరిజన తెగల్లో ఉన్న ఓ ఆచారం మనకు వింతగా అనిపిస్తుంది. అబ్బాయి అమ్మాయిని ఇష్టపడితే వారి తల్లిదండ్రులకు ఆ విషయం తెలపాల్సి ఉంటుంది. వారి అనుమతితోనే అమ్మాయిని తీసుకుని ఇద్దరు కలిసి వేరే గ్రామం వెళ్లి సహజీవనం చేస్తారు. వారికి ఓ పాపో, బాబో పుట్టాక మళ్లీ స్వగ్రామం వస్తారు. అప్పుడు పంచాయితీ పెట్టి వారికి జరిమానా విధిస్తారు. వారు విధించిన జరిమానా కడితేనే వారికి వారి తండ్రి ఆస్తిలో భాగం వస్తుంది. లేదంటే రాదు.
Also Read: PM Modi- Gujarat Riot Case: ప్రతీకారం షురూ: మోడీకి క్లీన్ చిట్.. ఆయనపై పిటీషన్ వేసిన వాళ్లు జైలుకు..
వారు జరిమానా కడితేనే వారికి వివాహం జరిపిస్తారు. వారి ఆస్తి కూడా వారి సొంతం అవుతుంది. ఇలాంటి వింత ఆచారం ఇక్కడి గిరిజనుల్లో ఉండటం గమనార్హం. దీంతో వారి ఆచార వ్యవహారంపై అందరిలో ఆసక్తి నెలకొంది. వారు ఊరి విడిచి వెళ్లడం తరువాత రావడం ఓ వింతగా తోస్తుంది. తరువాత వారు జరిమానా కట్టడం కూడా ఓ గమ్మత్తైన విషయమే. దీంతో దంపతులు కావాలంటే ఇన్ని తతంగాలు దాటాల్సిందే. గిరిజనుల్లో వింతైన ఆచారాలు ఉండటం చూస్తుంటాం. అందులో ఇదొకటి కావడం గమనార్హం.

పెళ్లిళ్ల విషయంలో రకరకాల ఆచారాలు మనుగడలో ఉన్నాయి. వాటన్నింటి గురించి తెలుసుకుంటే మనకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. వింతైన ఆచారాలు గమ్మత్తైన వ్యవహారాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించే ఆచారం గురించి తెలుసుకున్నాం కదూ. ఇంకా దేశంలో ఎన్నో రకాల ఆచారాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అన్నింటిని గురించి తెలుసుకునే సమయం మనకు ఉండకపోవడంతో కొన్ని తెలియకుండా పోతున్నాయి. అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని పిలవడం తెలిసిందే.
Also Read:Actor Nassar: నటనకు ఇక సెలవు.. లెజెండరీ నటుడు షాకింగ్ నిర్ణయం !