Folk artists Suranna and Asiraiah: ఈ మద్యన అందరు పాటలు పాడెస్తన్రు. ఎ సికాకుళలమొలే ఎక్కవగా పాడతన్రు. సిలిమాల్లోనూ.. సెల్ లోనూ ఎక్కడ సూసినా అలే కనిపిస్తన్రు. గొప్ప సాన్స్ కొట్టేస్తన్రు. ఆ మద్యన అల్లు అర్జును సినిమా వచ్చింది కదా. అదే సిత్తరాల సిరపడు పాడినోలు అవులనుకుంటాన్రు బాడ సూరన్న. ఏ వూరు అనుకుంతన్రు. సికాకుళం జిల్లా మందస మండలం బైరిసారంగపురం.

ఎంత బాగ పాడినడు తెలుసా. అతగాడి పాటకు అల్లు అర్జునే గొప్పబాగా మెచ్చుకున్నడు. ఒంటి మీద కోటు కూడా ఇచ్చెన్డు. ఊరురా గంగిరెద్దులు తిప్పే మన సూరన్న గొప్ప సేన్స్ కొట్టినాడు. మన సికాకుళం పరువు నిలిపినాడు. పేదొడైనా గొప్ప కళున్నదిరా ఆడి దగ్గర. ఎదైనా గొప్ప పనిసేసెన్డు. సిలిమాల్లో పాడడమంటే సిన్న ఇషయమా? పొనిలేరా మన సికాకొళమంతె ఏలాకోలం సేసినాలికి మన సూరన్నలాటోలు నోరు ముయ్యిస్తన్రు. సిలిమాల్లో పాటలు పాడిన సూరన్న గొప్ప సింపులుగా ఉంతడు. మొన్న పండక్కి గంగిరెద్దులు తిప్పడం మరిసిపోలెదు. ఆడు మనిసంతె. సూరన్న నువ్వు ఎక్కువ సిలిమాల్లో పాటలు పాడాలి. సికాకుళం పరువు నిలబెట్టాలి.

మరి ఆ మద్యన నాది నక్లిలీసు గొలుసు పాటు ఎవరదనుకుంతన్నరేటి. మన అసిరయ్య. ఏ ఊరు అనుకుంతన్నవు. అదే సంతకవిటి మండలం వాల్తేరు. పొట్టకూటి కొసం జముకుల పాడే అసిరయ్య గొప్ప సెలబ్రిటి అయిపోనాడు. గొప్ప అదురుష్టవంతుడు అయిపొనాడు. ఎక్కడొ రైలుబండిలొన పాడతుంటే అవుడో కుర్రాడు పొన్లో ఈడియో తిసి పెట్టినాడు. అది అందరు సూసి మెచ్చుకున్నారట. సిలిమాలొన సంగితం డైరెక్టర్ కుంచె రగుబాబు సూసినాడు. అప్పుడు ఆ మధ్యన వచ్చింది కదా పలాస సినిమాలొ సాన్స్ ఇచ్చెనడు. అప్పడు నుంచి మన అసిరయ్య దశ తిరిగింది.
సిలిమాలో పాటలు పడేసి సెలబ్రిటి అయిపోనాడు. అయినా మంచిదే కద.. సికాకుళమొలికి సోసల్ మిడియా సాలా అవకాశాలిచ్చాతంది. సేలమంది కుర్రాలు ఇప్పుడు పాటు రాసెస్తన్రు.. పాడెస్తన్రు..
