Shruti Haasan Remuneration : రెండు సంక్రాంతి చిత్రాల్లో హీరోయిన్ గా ఉండటం అరుదైన విషయం. గతంలో సిమ్రాన్, సౌందర్యతో పాటు మరికొందరు హీరోయిన్స్ ఈ ఫీట్ సాధించాయి. స్టార్ హీరోలు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రోజుల్లో దాన్ని గొప్ప విషయంగా చెప్పలేం. ప్రజెంట్ సిట్యువేషన్ కి ఇది వెరీ స్పెషల్. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆ రెండు చిత్రాలు విజయం సాధించడం. 2001లో మృగరాజు, నరసింహనాయుడు చిత్రాలు విడుదలయ్యాయి. సిమ్రాన్ బాలయ్య, చిరంజీవితో జతకట్టారు. అయితే నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కాగా, మృగరాజు ప్లాప్ అయ్యింది.

కానీ శృతి నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ సక్సెస్ టాక్ తెచ్చుకున్నాయి. అత్యధిక వసూళ్లతో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఒక్కరే కావడం మరో కామన్ పాయింట్. మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల నిర్మాతలుగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం మారారు. చిరుకి దేవిశ్రీ, బాలయ్యకు థమన్ అందించారు.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ శృతి హాసన్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఒక్కో సినిమాకు ఇచ్చారా? లేక రెండు సినిమాలకు కలిపి ఇచ్చారా? అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం అందుతుంది. ఇండస్ట్రీ వర్గాల వాదన ప్రకారం రెండు చిత్రాలకు కలిపి సింగిల్ పేమెంట్ మాట్లాడి శృతితో ఓకే చేశారట. ఏక కాలంలో సెట్స్ పై ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమైందట. కాగా శృతి సంక్రాంతి చిత్రాల్లో నటించినందుకు రూ. 5 కోట్లు తీసుకున్నారట.
అంటే ఒక్కో చిత్రాన్ని రూ. 2.5 కోట్లన్న మాట. ప్రస్తుత శృతి ఫార్మ్ కి అది ఎక్కువే అని చెప్పాలి. కారణం దాదాపు రెండేళ్లు చిత్ర పరిశ్రమకు దూరమైన శృతి తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యారు. గోపీచంద్ మలినేని పుణ్యమా అంటూ క్రాక్ తో వెలుగులోకి వచ్చింది. ఆఫర్స్ లేక సతమతమవుతున్న శృతికి సీనియర్ హీరోల పక్కన ఛాన్స్ దక్కింది. అయితే శృతి చేతిలో సలార్ రూపంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఉంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ ల ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.