KL Rahul Marriage: స్టార్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ప్రముఖ నేషనల్ మీడియా ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. 2023 జనవరిలో కె ఎల్ రాహుల్ హీరోయిన్ అథియా శెట్టి మెడలో తాళి కడుతున్నారు. రాహుల్-అథియా అధికారికంగా పెళ్లి ప్రకటన చేయకున్నప్పటికీ ఇది విశ్వసనీయ సమాచారం అంటున్నారు. జనవరి 20 తేదీ లోపే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారట. ఇక రాహుల్-అథియా పెళ్ళికి హిల్ స్టేషన్ కండాల ఏరియాలో ఉన్న సునీల్ శెట్టికి చెందిన బంగ్లా వేదిక కానుందట. అక్కడ ప్రకృతి మధ్య వివాహం జరపనున్నారట.

పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందట. రాహుల్ కి బాగా దగ్గరైన కొందరు క్రికెటర్స్, అలాగే అథియా, సునీల్ శెట్టి సినిమా ఫ్రెండ్స్ లో కొందరికి మాత్రమే ఆహ్వానం ఉంటుందట. పెళ్లి అనంతరం గ్రాండ్ గా అందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. రాహుల్-అథియా రిసెప్షన్ కి రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం.
అథియా సునీల్ శెట్టి వారసురాలిగా 2015లో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘హీరో’ ఆమె మొదటి చిత్రం. అనంతరం ముబారకన్, నవాబ్జాదే చిత్రాల్లో నటించారు. అథియా నటించిన చివరి చిత్రం మోటీచోర్ చక్నాచోర్ 2019లో విడుదలైంది. హీరోయిన్ గా ఆమె చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కాలేదు.

2018 నుంచి కె ఎల్ రాహుల్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారు. వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే. ఇరు కుటుంబాల పెద్దలు కూడా అనుమతి తెలుపడంతో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇక ఇండియన్ క్రికెటర్ స్టార్ ఓపెనర్ అయిన రాహుల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మనోడుకి ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో హీరోయిన్ నిధి అగర్వాల్ తో ఎఫైర్ నడిపారన్న రూమర్స్ ఉన్నాయి. కాఫీ విత్ కరణ్ షోలో రాహుల్, హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. బీసీసీ నుండి వారిద్దరూ బహిష్కరణ ఎదుర్కొన్నారు.