Pawan Kalyan- Prithviraj Sukumaran: ఈ ఏడాది ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన భీమ్లా నాయక్ చిత్రాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..పవన్ కళ్యాణ్ ని ముందుపెన్నడూ లేనంత మాస్ గా ఈ చిత్రం లో చూపించాడు డైరెక్టర్ సాగర్ చంద్ర..ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనం కోషియమ్’ అనే సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.

ఒరిజినల్ వెర్షన్ లో పవన్ కళ్యాణ్ పాత్ర ని బిజుమీనన్ చెయ్యగా , రానా పాత్రని అక్కడి స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసాడు..మలయాళం లో కంటే తెలుగులోనే ఈ చిత్రం ని బాగా తీశారు..ఆత్మవిశ్వాసానికి మరియు అహంకారానికి జరిగిన సంగ్రామం లో చివరికి ఆత్మ విశ్వాసమే గెలిచింది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..ఈ సినిమాని చూసి పృథ్వీ రాజ్ సుకుమారన్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఎంతో మెచ్చుకున్నాడట.
‘మీకు సరిపొయ్యే కథ ఒకటి నా దగ్గర ఉంది..మీరు ఒప్పుకుంటే నేనే ఆ సినిమాకి డైరెక్ట్ చేస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ ని అడిగాడట పృథ్వీ రాజ్..కచ్చితంగా మనం కలిసి పని చేద్దాం అని పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడట..ఇటీవలే హైదరాబాద్ కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ని కలిసి స్టోరీ వినిపించాడు పృథ్వీ రాజ్..పవన్ కళ్యాణ్ కి అతను చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చిందట..స్క్రిప్ట్ డెవలప్ చెయ్యమని చెప్పాడట..అలా త్వరలోనే ఈ క్రేజీ స్టార్ హీరో డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు అన్నమాట.

పృథ్వీ రాజ్ మలయాళం లో టాప్ 3 స్టార్ హీరోస్ లో ఒకరు..కేవలం హీరో గా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పృథ్వీ రాజ్ తన సత్తాని చాటాడు..ఈ చిత్రం మలయాళం లోనే బిగ్గెస్ గ్రాసర్ గా నిలిచింది..తెలుగు లో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేసారు..ప్రస్తుతం పృథ్వీ రాజ్ మోహన్ లాల్ తో లూసిఫెర్ పార్ట్ 2 చేస్తున్నాడు..ఈ సినిమా పూర్తి అవ్వగానే పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.