Anchor Varshini: హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో యాంకర్ గా టర్న్ తీసుకుంది యాంకర్ వర్షిణి. ఆమెకు బుల్లితెరపై కూడా చెప్పుకోదగ్గ గుర్తింపు రావడం లేదు. దీంతో స్కిన్ షోతోనే సర్వైవ్ కావాలి అనుకుంటుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ హద్దులు దాటేస్తున్నాయి. బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వాళ్ళను ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తుంది. టాప్ తీసేసి లోదుస్తుల్లో ఫోటో షూట్ చేసిన వర్షిణి తెగింపుకు జనాలు పచ్చి బూతు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆస్తిపాస్తులు ఉన్నోళ్లు హోదా ప్రదర్శిస్తారు. అందాలు ఉన్నోళ్లు వాటిని ప్రదర్శిస్తారని మద్దతు తెలుపుతున్నారు.

వర్షిణి గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఈ హైదరాబాద్ బ్యూటీ మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. చందమామ కథలు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2014లో చందమామ కథలు విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ప్రేక్షకులు పట్టించుకోలేదు. అనంతరం వరుసగా రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. అవన్నీ స్మాల్ బడ్జెట్ చిత్రాలు. దాంతో వర్షిణికి ఎలాంటి గుర్తింపు రాలేదు.
చేసేది లేక యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఒక ప్రక్క యాంకరింగ్ చేస్తూనే సినిమాలు, సిరీస్లలో నటిస్తున్నారు. పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ యాంకర్ గా వర్షిణి ఒక సీజన్ కి వ్యవహరించారు. హైపర్ ఆదితో జతకట్టి రొమాన్స్ చేసింది. అయితే నెక్స్ట్ సీజన్స్ నుండి ఆమెను తప్పించారు. ప్రస్తుతం వర్షిణి కామెడీ స్టార్స్ షోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ కొనసాగుతున్నారు.

అనసూయ, రష్మీ, శ్రీముఖి మాదిరి వర్షిణి కూడా మొహమాటం లేకుండా గ్లామర్ షో చేస్తుంది. అయితే వారిలా సక్సెస్, ఫేమ్ రావడం లేదు. ఆ ముగ్గురితో పోల్చుకుంటే వర్ష ఎక్కడో ఉన్నారు. ఈ ఏడాది వర్ష నటించిన ‘మళ్ళీ మొదలైంది’ చిత్రం విడుదలైంది. సుమంత్ హీరోగా నటించిన ఈ చిత్రం విజయం సాధించలేదు. ప్రస్తుతం వర్షిణి శాకుంతలం మూవీలో నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకుడిగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. శాకుంతలం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.