Mahesh Babu – Trivikram : ఇక సిగరెట్ ముట్టుకోను అన్న మహేష్..ఇలా మాట తప్పేశాడేంటి!

    Mahesh Babu – Trivikram SSMB28 : ఎంతో సాఫ్ట్ గా పాలబుగ్గల వేసుకొని ఉండే మహేష్ బాబు , ఒకప్పుడు చైన్ స్మోకర్ అనే విషయం అందరికీ తెలిసిందే.చైన్ స్మోకర్ అంటే రోజుకి కనీసం నాలుగు ప్యాకెట్స్ సిగరెట్స్ తాగడం అన్నమాట.ఆ తర్వాత ఒక బుక్ చదివానని,అప్పటి నుండి సిగరెట్ తాగడం మానేసాను అంటూ చెప్పుకొచ్చాడు.అంతే కాదు సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలు ఇక పెట్టబోను అంటూ చెప్పుకొచ్చాడు. చెప్పిన మాట ప్రకారమే ‘అతిథి’ […]

Written By: NARESH, Updated On : March 26, 2023 7:10 pm
Follow us on

 

 

Mahesh Babu – Trivikram SSMB28 : ఎంతో సాఫ్ట్ గా పాలబుగ్గల వేసుకొని ఉండే మహేష్ బాబు , ఒకప్పుడు చైన్ స్మోకర్ అనే విషయం అందరికీ తెలిసిందే.చైన్ స్మోకర్ అంటే రోజుకి కనీసం నాలుగు ప్యాకెట్స్ సిగరెట్స్ తాగడం అన్నమాట.ఆ తర్వాత ఒక బుక్ చదివానని,అప్పటి నుండి సిగరెట్ తాగడం మానేసాను అంటూ చెప్పుకొచ్చాడు.అంతే కాదు సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలు ఇక పెట్టబోను అంటూ చెప్పుకొచ్చాడు.

చెప్పిన మాట ప్రకారమే ‘అతిథి’ సినిమా తర్వాత ఇప్పటి వరకు సిగరెట్ ముట్టలేదు.అయితే ఈరోజు విడుదల చేసిన మహేష్ త్రివిక్రమ్ మూవీ పోస్టర్ లో మాత్రం మహేష్ సిగరెట్ కొడుతూ స్టైల్ గా అలా నడిచి వస్తున్న ఫోటోని చిత్ర బృందం విడుదల చెయ్యగా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.టైటిల్ కూడా వస్తుంది అనుకున్నారు కానీ , కేవలం విడుదల తేదీని మాత్రమే ప్రకటించారు.

జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ పట్ల ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నారు కానీ, మహేష్ సిగరెట్ ముట్టుకోను అంటూ ఇచ్చిన మాట ని తప్పినందుకు మాత్రం కాస్త హర్ట్ అయ్యారు.ఇదంతా పక్కన పెడితే మహేష్ సిగరెట్ తాగినప్పుడల్లా సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఒక్కడు , పోకిరి వంటి సినిమాలు ఆయన కెరీర్ నే మలుపు తిప్పాయి.

మధ్యలో అతిథి లో కూడా సిగరెట్ కాలుస్తాడు కానీ, ఆ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది.ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఓపెనింగ్స్ దంచి కొట్టింది.అలా ఏ విధంగా చూసుకున్న మహేష్ బాబు సిగరెట్ తాగినప్పుడల్లా ఇండస్ట్రీ షేక్ అయ్యింది.ఇప్పుడు మరోసారి కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.