Homeఎంటర్టైన్మెంట్RRR-2 Movie Story: #RRR-2 మూవీ స్టోరీ ఇదేనా.. రాజమౌళి మామూలోడు కాదుగా!

RRR-2 Movie Story: #RRR-2 మూవీ స్టోరీ ఇదేనా.. రాజమౌళి మామూలోడు కాదుగా!

RRR-2 Movie Story: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు ఎలాంటివో అంత తేలికగా ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది.. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రాన్ని ఇటీవలే జపాన్ లో అనువదించి విడుదల చెయ్యగా అక్కడ కూడా దుమ్ము లేపేసింది.

RRR-2 Movie Story
rajamouli, ntr ram charan

అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతుందని రాజమౌళి ఇటీవలే లాస్స్ ఏంజిల్స్ లో జరిగిన ఒక ఈవెంట్ లో మీడియా కి తెలిపారు..RRR సీక్వెల్ మీద ఒక పాయింట్ దొరికిందని.. నాన్న(విజయేంద్రప్రసాద్) ఆ పాయింట్ మీదనే స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాడని రాజమౌళి చెప్పుకొచ్చాడు.. అయితే బాహుబలి, కేజీఎఫ్ , పుష్ప మూవీస్ తరహాలో #RRR సీక్వెల్ గురించి క్లైమాక్స్ లో ఎలాంటి హింట్ ఇవ్వలేదు రాజమౌళి.

కొమురం భీం -రామరాజు ఎవరి లక్ష్యాలను వాళ్ళు చేరుకోవడంతో కథ సుఖాంతం అయ్యింది కదా.. ఇక ఏ పాయింట్ మీద ఈ మూవీ సీక్వెల్ ని తియ్యాలనుకుంటున్నారు అనే సందేహం అభిమానుల్లో నెలకొంది..అయితే సీక్వెల్ లో రామరాజు ఊరుకి , కొమరం భీం తండా వాసుల మధ్య జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తునట్టు సమాచారం.

RRR-2 Movie Story
ntr- ram charan

బ్రిటిష్ కోటని.. స్కాట్ దొరని చంపినందుకు బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈ రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని.. తమ గ్రామాలను కాపాడుకునే దశలో రామ్ – భీం మధ్య మరోసారి తీవ్రమైన యుద్ధం జరుగుతుందని..ఆ తర్వాత బ్రిటిష్ వారిని కుట్రని పసిగట్టి వాళ్ళ ఆటను వీళ్లిద్దరు కలిసి ఎలా కట్టడి చేశారన్నది ఈ మూవీ స్టోరీ అట.. కథ వింటుంటే.. చాలా సింపుల్ గా అనిపిస్తుంది..కానీ రాజమౌళి టేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన సినిమాల్లో కథలన్నీ మామూలుగానే ఉంటాయి.. తన దర్శకత్వ ప్రతిభ తోనే ఆయన అద్భుతమైన దృశ్యకావ్యాలుగా మలుస్తుంటారు.. ఈ సీక్వెల్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్న రాజమౌళి.. ఈ చిత్రం పూర్తి అవ్వగానే RRR సీక్వెల్ ని తెరకెక్కిస్తాడని తెలుస్తోంది

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version