విధి చాలా విచిత్రమైంది. మనుషులను పావులుగా చేసి ఆడుకుంటుంది. ఓ వ్యక్తి మరణం ఆ కుటుంబ సభ్యులను రోడ్డున పడేస్తుంది. నటుడు శ్రీహరి మరణం తర్వాత ఆయన కుటుంబ పరిస్థితి అలానే ఉందని సమాచారం. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి స్వశక్తి హీరో అయ్యారు. దేవా, సాంబయ్య, పోలీస్, భద్రాచలం వంటి సూపర్ హిట్స్ కొట్టాడు. ఒక దశలో రియల్ స్టార్ ఇమేజ్ తో వెలిగిపోయాడు.

హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ చేశారు. కెరీర్ లో శ్రీహరి వందకు పైగా చిత్రాలు చేశారు. 1996లో నటి డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. డిస్కో శాంతి సైతం సక్సెస్ ఫుల్ యాక్ట్రెస్. 90లలో సౌత్ ఇండియాలో డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ ఆమె. ఐటమ్ సాంగ్స్ కి చాలా ప్రత్యేకం. అలాగే ఇతర రోల్స్ కూడా చేసేవారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి ఆమె 900 వందల చిత్రాలకు పైగా చేశారు.
Also Read: Budjet 2022: బడ్జెట్ పై కేసీఆర్ రచ్చ రచ్చ.. జగన్ మౌనం.. బాబు మొహమాటం.. పవన్ స్పందన ఘోరం
ఏడాదికి పదుల సంఖ్యలో చిత్రాలు చేసేవారు. పరిశ్రమలో నిలదొక్కుకున్న స్టార్ కపుల్ గా వాళ్లకు ఎంతో ఘన చరిత్ర ఉంది. అయితే అదంతా గతమే అన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి మాటలు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. శ్రీహరి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయట. శ్రీహరి బతికున్న రోజుల్లో అనేక మంది సహాయం కోరి ఇంటికి వచ్చేవారట.
ఎవరు వచ్చినా కాదనకుండా… తోచి సహాయం చేసి పంపేవారట. సంపాదనలో కొంత పేదవారికి ఖర్చు చేయడం శ్రీహరి సామజిక బాధ్యతగా బావిచేవారట. 49 ఏళ్లకే శ్రీహరి అకాల మరణం పొందారు. శ్రీహరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు మేఘాంశ్ హీరోగా రాజ్ దూత్ పేరుతో ఓ చిత్రం చేశారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. హీరోగా ఎదిగి కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని మేఘాంశ్ భావిస్తున్నట్లు సమాచారం. బిజీ నటుడిగా శ్రీహరి కోట్లు సంపాదించారు.
Also Read: Union Budjet 2022: బడ్జెట్ లో ఏపీ ఇచ్చింది గుండుసున్నానే?
అలాంటి కుటుంబానికి ఇలాంటి దుర్భర పరిస్థితి ఊహించనిదే. ఓడలు బండ్లు… బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో. ప్రస్తుతం డిస్కో శాంతి కుటుంబం చెన్నైలో నివాసం ఉంటున్నారు. కాగా ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి డిస్కో శాంతికి స్వయానా చెల్లెలు.
For LIVE News, National Updates, India News Watch:

