Mumbai Auto Driver: అతడో ఆటో డ్రైవర్. కానీ విలువలకు ప్రాణం ఇస్తాడు. చెడు పనులను చూస్తూ ఊరుకోడు. గిరాకీ లేకున్నా సరే కానీ ఆటోలో కొంటె చేష్టలను ఇష్టపడడు. అవసరమైతే మధ్యలోనే దించేస్తాడు. తనకు డబ్బులు రాకున్నా ఫరవాలేదు. కానీ తన ఆటోలో సంఘ వ్యతిరేక పనులు వద్దంటూ ఏకంగా బోర్డు పెట్టేశాడు. దీంతో అందరు అతడిని ప్రశ్నించారు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే ప్రమాదాలకు మూల కారణం ఇవే అంటూ తనదైన శైలిలో వివరణ ఇస్తున్నాడు.

ముంబైకి చెందిన నానాజీ అనే వ్యక్తి బ్యాంకు రుణం తీసుకుని ఓ ఆటో కొనుక్కున్నాడు. దాన్ని నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ తన ఆటోలో ఎలాంటి తప్పు జరిగినా క్షమించడు. అవసరమైతే గిరాకీ లేకున్నా ఫర్వాలేదు కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అతడు వ్యతిరేకం. ఓసారి దాదర్ నుంచి మహమ్మద్ అలీ రోడ్డు వైపు వెళ్తుండగా ఓ జంట ఆటో ఆపారు.
నారీమన్ పాయింట్ కు వెళ్లాలని అడిగారు. దీంతో వారిని ఎక్కించుకుని అటు వైపు కదులుతున్నాడు. కానీ ఆటోలో వారి చేష్టలు చూసి నానాజీకి కోపం వచ్చింది. సరిగా ఉండాలని సూచించినా వారు వినలేదు. దీంతో కోపోద్రిక్తుడైన నానాజీ వారిని కిందకి దింపేసి వెళ్లిపోయాడు. తన ఆటోలో ఇలాంటి వారు ఉండరాదని ఏదో నిర్ణయం తీసుకోవాలని భావించాడు. ఇలా చేస్తే ఆటోల్లో ఎక్కే ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించాడు.
Also Read: కేంద్రం తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం..: ఈసారి ఎవరికి గడ్డుకాలమో..?
అనుకున్నదే తడవుగా ఓ ఆలోచన చేశాడు. మరునాడు తన ఆటోలో అద్దం మీద ఓ ఫొటో పెట్టి తన ఆటోలో ఇలా చేస్తే సహించనని విషయం రాయించాడు. దీంతో తోటి డ్రైవర్లు ఇదేంటని ప్రశ్నిస్తే ఇటువంటి వారితోనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేశాడు. ఆటోలో ఎక్కితే మంచిగా ప్రయాణం చేయాలే కానీ ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఎందుకు క్షమించాలని పేర్కొన్నాడు.
ఆటో డ్రైవరైనా ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా ఓ ఆటో డ్రైవర్ విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే సంఘంపై అతడికి కూడా ఓ భావన ఉన్నట్లు తెలుస్తోంది. అందరు ఆటో డ్రైవర్లు ఇలా ఆలోచిస్తే చెడుకు అవకాశమే ఉండదని చెబుతున్నారు. విలువల పరిరక్షణకు అందరు నడుం కట్టాలని ఆశిస్తున్నారు.
Also Read: కేసీఆర్ కొత్త పార్టీపై సర్వేలు..! ప్రజలేమనుకుంటున్నారు..?
మహిళా సంరక్షణ చట్టాలు, సెక్షన్స్
