Bigg Boss 6 Telugu : ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇస్తునన్ని ట్విస్టులు సినిమాలలో ఏ టాప్ డైరెక్టర్ కూడా ఇచ్చి ఉండదు..రోజుకో ఊహించని మలుపుతో ప్రేక్షకులకు షాక్ మీద షాక్ ఇస్తూ ముందుకు వెళ్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 11 వ వారం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా బాలాదిత్య మరియు వాసంతి ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు హౌస్ లో టాప్ 10 కంటెస్టెంట్స్ గా శ్రీ సత్య , రేవంత్ , శ్రీహాన్ , ఇనాయ ,మరీనా, రోహిత్, కీర్తి,ఆది రెడ్డి , రాజ్ మరియు ఫైమా మిగిలారు.
వీరిలో ఫైమా మినహా మిగిలిన ఇంటిసభ్యులందరు నామినేట్ అయ్యారు..అయితే కెప్టెన్సీ టాస్కు ప్రారంభం అయ్యే ముందు నామినేషన్స్ నుండి ఒక ఇంటి సభ్యులు సేఫ్ అయ్యే అద్భుతమైన అవకాశం ని బిగ్ బాస్ కలిపించాడు..కానీ ఏదో ఒక మెలిక పెట్టకుండా అలా మాములుగా ఇచ్చేస్తే ఆయన బిగ్ బాస్ ఎలా అవుతాడు..అందుకే సేఫ్ అవ్వాలంటే బిగ్ బాస్ కాష్ ప్రైజ్ నుండి హై యూనిక్ అమౌంట్ ని బిడ్ చెయ్యాలని కండిషన్ పెడుతాడు బిగ్ బాస్.
ఇందులో రాజ్ అందరికంటే హైయెస్ట్ యూనిక్ అమౌంట్ 4,99,700 బిడ్ చేసి నామినేషన్స్ నుండి సేఫ్ అవుతాడు..అతను సేఫ్ అవ్వగానే బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుండి 5 లక్షల రూపాయిలు తగ్గిపోతుంది..అంతే కాకుండా బిగ్ బాస్ కొన్ని సవాళ్ళను ఇస్తాడని..అవి గెలిస్తే బిగ్ బాస్ ప్రైజ్ మని లక్ష రూపాయిలు పెరుగుతుందని..లేదంటే లక్ష రూపాయిలు తగ్గుతుందని చెప్తాడు..మొదటి సవాలు లో భాగంగా వికెట్స్ మధ్యలో ఎవరైనా ఇద్దరు ఇంటి సభ్యులు 7 నిమిషాల్లో వంద పరుగులు తియ్యాలంటాడు.
ఈ సవాలు ని స్వీకరించి రేవంత్ మరియు రోహిత్ రంగం లోకి దిగి 80 పరుగులు తీసి ఓడిపోతారు..వాళ్ళు ఓడిపోయినందుకు గాను బిగ్ బాస్ మరో లక్ష తగ్గిస్తాడు..ఇక ఈరోజు జరిగే కెప్టెన్సీ టాస్కు లో శ్రీహాన్ మాట్లాడుతూ ‘మొన్న వీకెండ్ లో ప్రైజ్ మని 50 లక్షలు ఇస్తానని అంత ఘనంగా చెప్పి..మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెట్టావు ఏంటి బిగ్ బాస్..ఇదెక్కడి మోసం’ అంటాడు..ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.