Superstar Krishna Srisri: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సంస్కరణలు చేసిన సాహసిగా గుర్తింపు పొందాడు. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా.. తొలి 70 ఎంఎం సినిమా, తొలి జేమ్స్ బాంబ్ సినిమా, తొలి తెలుగు కౌబాయ్ సినిమా తీసిన హీరో మన కృష్ణనే.. ఆయన పరమపదించిన వేళ ఆయన చేసిన సాహసాలు, సంస్కరణలు, చేసిన గొప్ప పనులను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. హీరోగానే కాదు.. నిర్మాతల మంచికోరే నటుడిగా.. మంచి మనసులున్న మనిషిగా కృష్ణ గుర్తింపు పొందాడు.
అలాంటి కృష్ణ ఎందరికో సాయం చేశాడు. ఇండస్ట్రీలో నిలబెట్టాడు. కృష్ణ సినిమాలకు మహా గొప్ప రచయిత శ్రీశ్రీ కూడా పనిచేశాడు. కృష్ణ గురించి ప్రముఖ రచయిత, మహా కవి శ్రీశ్రీ గతంలో గొప్పగా చెప్పారు. కృష్ణ గురించి శ్రీశ్రీ ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ’ అని శ్రీశ్రీ గొప్పగా కృష్ణ కీర్తిని ఇనుమడించేలా రాశాడు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కృష్ణ గొప్పతనానికి, వ్యక్తిత్వానాకి జోహర్లు పలుకుతున్నారు.
కృష్ణతో కలిసి ‘అల్లూరి సీతరామరాజు’ సినిమా కోసం శ్రీశ్రీ పనిచేశారు. ఇందులోని గొప్ప స్వాతంత్ర్య సమర పాటలను, డైలాగులను శ్రీశ్రీ రాశారు. నాడు కృష్ణ శ్రీశ్రీకి మంచి పారితోషకం ఇచ్చి ఆయనను గౌరవించారని పేరుంది.