
Sri Reddy- Jagan: శ్రీరెడ్డి… పరిచయం అక్కర్లేని పేరు. ఆమె సినీ నటి అని కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసేదాకా ఎవరికీ తెలియదు. అప్పటి నుంచి కంట్రవర్సీ ఆరోపణలతో సెలబ్రిటీగామారిపోయారు. తెలుగు చిత్రసీమ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కొంతమంది నిర్మాతలు మరియు వారి కొడుకుల మీద ఆరోపణలు చేసి మీడియా దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం వివాదాలతో, వ్యక్తిగత దూషణలకు ముందుండే శ్రీరెడ్డి వాడే భాష సైతం అభ్యంతరకరంగా ఉంటుంది. అటు రాజకీయ ఆరోపణలు చేయడంలో సైతం ముందుండే వారు. పవన్ కు వ్యతిరేకంగా జగన్ కు మద్దతుగా నిలిచిన ఆమె తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి మకాం మార్చారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో తప్ప.. మరెక్కడా కనిపించడం లేదు. ఫేస్ బుక్ లో మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.
ఎప్పుడూ కంట్రవర్సీ కామెంట్స్..
పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ శ్రీరెడ్డి కామెంట్స్ పచ్చిపచ్చిగా ఉండేవి. బూతులతో విరుచుకుపడేవారు. ఒక్క సీఎం జగన్ కు తప్ప.. మరే ఇతర నాయకులను వదల్లేదు. సినీ సెలబ్రిటీలపై సైతం ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. తరచూ ఆమె పెట్టే పోస్టులు వివాదాస్పద మయ్యాయి. నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. అటువంటి శ్రీరెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆలోచింపజేసే విధంగా ఉంది. సినీ ప్రముఖులు, సంఘాలు ఉన్నా ఎవరూ చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంటున్నారు శ్రీరెడ్డి.
వారికి సరే.. ఇక్కడి వారికో?
ప్రస్తుతం తెలుగు సినిమా రంగం నుంచి రోజా మంత్రిగా ఉన్నారు. పోసాని కృష్ణమురళి, అలీలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అంతకు మించి ఎవరికీ పదవులు లేవు. ఇటువంటి సమయంలో తెలంగాణకు చెందిన సింగర్ మంగ్లీ, కనకవ్వలాంటి వారికి సైతం ఏపీ సర్కారు ప్రాధాన్యమిచ్చింది. ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో కీలక పదవులిచ్చింది. అదే సమయంలో ఏపీకి చెందిన కళాకారుల మాటేమిటి అని శ్రీరెడ్డి ప్రశ్నిస్తోంది. నెల్లూరు నుంచి సిక్కోలు వరకూ.. రాయలసీమలో సైతం అద్భుతమైన కళాకారులు ఉన్నారని.. వారందరికీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరముంది జగనన్న అంటూ శ్రీరెడ్డి సలహా ఇచ్చింది.
ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ…
కర్ణాటక (కాంతారా),తమిళనాడు (జల్లికట్టు),తెలంగాణ (బోనాలు ) ఇలా ప్రతి రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలు. ఉన్నట్టే మన రాష్ట్రానికి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయని గుర్తుచేసింది. కుచిపూడి నృత్యం, శ్రీకాకుళం జానపదాలు, గిరిజన నృత్యాలు, కోలాటాల కళాకారులను ప్రోత్సహించాలని విన్నవించారు. కొండపల్లి బొమ్మలు,బందర్ లడ్డులు ,ఉప్పాడ,ధర్మవరం ,మంగళగిరి చీరలు ,చేనేత కార్మికులను ఎంకరేజ్ చేస్తే మరింత అభివృద్ధి సాధిస్తారని శ్రీరెడ్డి కోరుతున్నారు. గోదావరి పాపి కొండలు ,వైజాగ్ ఓడ రేవు,రాంపా చోడవరం అడవులు,అరకు అందాలు,రాయల సీమ గొప్పతనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర ప్రత్యేకతలు ఉన్నాయని జగన్ కు గుర్తుచేశారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సెలవిచ్చారు. జగనన్న మీ కృషి, దృష్టి కొంచెం వాటిపై పెడితే బాగుండు అని సలహా ఇస్తున్నారు.

మార్పు వెనక కారణం?
అయితే చాన్నాళ్ల తరువాత శ్రీరెడ్డి బాధ్యతాయుతమైన పోస్టు పెట్టారని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెలోని మార్పును అభినందిస్తున్నారు.
మొదటినుంచి తనను తాను అతిగా అంచనా వేసుకునే శ్రీరెడ్డి అసలు తెలుగు చిత్రసీమకు సంబంధించిన వ్యక్తి అని ఆమె కాస్టింగ్ కౌచ్ పైన ఆరోపణలు చేసే దాకా తెలియదు. తర్వాత తన సోషల్ మీడియా పోస్టుల్లో హాట్ పిక్స్ అప్లోడ్ చేయడం…. కావాలని తన అందాలని బహిర్గత పరుస్తూ కుర్రకారును రెచ్చగొట్టడం వంటి ఎన్నో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ వచ్చింది. తను ప్రొఫెషనల్ గా నటి అయినా అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని వివాదాస్పదురాలిగా ముద్రపడ్డారు. ఇప్పడు దాని నుంచి అధిగమించే ప్రయత్నంలోనే తాజాగా జగన్ కు సలహా ఇస్తూ కామెంట్స్ పెట్టారన్న టాక్ వినిపిస్తోంది.