
Vijayendra Prasad: గత మూడు రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ వార్త ఊపేస్తోంది. అదేమిటంటే మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే చిత్ర కథ, హీరో పాత్ర గురించి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సన్నిహితులతో కొన్ని విషయాలు పంచుకున్నారట. ఈ చిత్రంలో మహేష్ పాత్రను రామాయణంలో హనుమంతుడు స్ఫూర్తితో రాశారట. మహేష్ రోల్ వీర హనుమాన్ షేడ్స్ కలిగి ఉంటుందట. ఈ మేరకు విజయేంద్రప్రసాద్ నేరుగా చెప్పినట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా… రైటర్ విజయేంద్ర ప్రసాద్ నేరుగా స్పందించారు.
ఆయన మాట్లాడుతూ… రాజమౌళి చిత్రాలకు, అందులోని పాత్రలకు రామాయణ, మహాభారతాలు, చందమామ కథలు, అమరచిత్ర కథలు స్ఫూర్తి. చెడుపై మంచి గెలవడం అనే విషయంలో వాటి నుండి ప్రేరణ పొందుతారు. అయితే రాజమౌళి నెక్స్ట్ మూవీలో మహేష్ పాత్రకు హనుమంతుడు స్ఫూర్తి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అది ఒక అబద్ధం, అని తేల్చేశారు. మహేష్ పాత్ర విభిన్నంగా తీర్చిద్దినట్లు వెల్లడించారు.
ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ అనేది మాత్రం నిజం. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ తో పాటు రాజమౌళి కూడా ధృవీకరించారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా మహేష్ తో తన మూవీ ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్ట్ పై జరుగుతున్న మరొక ప్రచారం. మొత్తం మూడు భాగాలుగా రానుంది. రూ. 2000 కోట్లకు పైగా బడ్జెట్ తో పదేళ్ల వ్యవధిలో విడుదల చేస్తారంటూ ఓ ప్రచారం జరుగుతుంది. మరి ఈ వాదనలో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు.

ఇక సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి ఆస్కార్ గెలిచారు. గ్లోబల్ ఫేమ్ రాబట్టారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ చిత్రాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆస్కార్ విజయంతో నాపై బాధ్యత మరింత పెరిగిందని రాజమౌళి అన్నారు. అదే స్థాయిలో మహేష్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టార్స్ మహేష్ మూవీలో భాగం కానున్నారని సమాచారం అందుతుంది.