
Sreemukhi: సెలబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ కల్పవృక్షం లా మారింది. ఎంత చూపిస్తే అంత పాపులారిటీ, ఫాలోవర్స్. తమకున్న ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ, మార్కెట్ పెరుగుతుంది. ప్రొడక్ట్స్, సర్వీసులను ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదించవచ్చు. అందుకే మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో హాట్ బ్యూటీస్ బిజీగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. అలాంటి వాళ్లలో శ్రీముఖి ఒకరు.
ఓ ఏడాది కాలంగా శ్రీముఖి తీరులో చాలా మార్పు వచ్చింది. గతంలో ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ కొంచెం పద్ధతిగా ఉండేవి. ఎంతైనా తెలుగు అమ్మాయి కావడంతో హద్దులు దాటకుండా పరిమితంగా స్కిన్ షో చేసేది.కానీ ప్రస్తుతం శ్రీముఖి బౌండరీలు దాటేస్తుంది. విచ్చలవిడిగా అందాలు చూపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. తాజాగా ఆమె ఏకంగా బ్రాను పోలిన టాప్ ధరించి కెమెరా ముందుకు వచ్చారు.

నెట్ టాప్ వేసి అందాలు అప్పనంగా చూపించేశారు. శ్రీముఖి ఫోటో షూట్ పై నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. మరీ సిగ్గు లేకుండా ఇలాంటి ఫోటోలు పెడతావా? మీ నాన్న, తమ్ముడు చూడరా?, అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మెజారిటీ ఫ్యాన్స్ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు తగ్గొద్దు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండని కామెంట్స్ పెడుతున్నారు. శ్రీముఖి లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నిజానికి శ్రీముఖి సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. యాంకర్ గా ఆమె టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు.వివిధ ఛానల్స్ లో అరడజనుకు పైగా షోలు శ్రీముఖి చేస్తున్నారు. చెప్పాలంటే సుమ, రష్మీ కూడా శ్రీముఖి తర్వాతే. మరోవైపు సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. రోజుకు లక్షల్లో సంపాదిస్తున్న శ్రీముఖికి ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్స్ చేయడం అవసరమా అని కొందరి వాదన.

చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి ఓ పాత్ర చేస్తున్నారట. చిరంజీవితో ఆమెకు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి లో భూమిక నడుము చూసే సీన్ స్పూఫ్ చేశారని వినికిడి. అలాగే బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రంలో శ్రీముఖి ఓ పాత్ర చేస్తున్నారట.
మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లలో శ్రీముఖి నటిస్తున్నారని సమాచారం. కాగా శ్రీముఖి అనతి కాలంలో యాంకర్ గా ఎదిగారు. పటాస్ షోతో శ్రీముఖి బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో రూపొందించిన యూత్ ఫుల్ షోని తన ఎనర్జీతో శ్రీముఖి సక్సెస్ ఫుల్ గా నడిపారు. మరో యాంకర్ రవితో కలిసి పటాస్ లో సందడి చేశారు. మెల్లగా ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకుని స్టార్ యాంకర్ అయ్యారు.