
Sreemukhi: బుల్లితెర మీద ప్రస్తుతం టాప్ లీడింగ్ యాంకర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో శ్రీముఖి పేరు కచ్చితంగా ఉంటుంది.పటాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన శ్రీముఖి, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు బాగా వచ్చాయి.వరుసగా ముఖ్యమైన పాత్రలు పోషించే అవకాశం రావడం తో ఆమె సన్నగా తయారైంది.దాంతో ఆమెకి మరింత అవకాశాలు రావడం మొదలయ్యాయి.అలా సినిమా అవకాశాలతో పాటుగా బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అరుదైన అదృష్టం కూడా దక్కింది.ఈ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
అలా కెరీర్ లో పీక్ స్టేజి ని ఎంజాయ్ చేస్తున్న శ్రీ ముఖి ఇటీవల పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.ముఖ్యంగా తనకి పెళ్లి మీద ఏర్పాడిన అభిప్రాయం వెనుక కథ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఆమెని అడగగా దానికి శ్రీముఖి సమాధానం చెప్తూ ‘గతం లో నేను ఒక అబ్బాయిని ఎంతో గాఢం గా ప్రేమించాను.తననే నా లోకంగా అనుకున్నాను, కానీ అతను నా వ్యక్తిగత విషయాలను, మరియు నా ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి నా పరువు మొత్తం తీసేసాడు.అది తెలిసినప్పటి నుండి నా మనసు చాలా నొచ్చుకుంది.ఆంటీ దుర్మార్గుడిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది.అప్పటి నుండి ప్రేమ అన్నా, పెళ్లి అన్నా ఎందుకో నాకు మంచి అభిప్రాయం లేదు’అంటూ చెప్పుకొచ్చింది.ఇంతకీ శ్రీముఖి ని అంత వాడుకొని వదిలేసినా ఆ దుర్మార్గుడు ఎవరు.అతను ఇండస్ట్రీ కి చెందిన వాడా, లేదా బయటి వాడా అనేది అభిమానులు సెర్చ్ చేస్తున్నారు.గతం లో శ్రీముఖి ఒక ప్రముఖ యాంకర్ తో తో ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వచ్చేవి,కొంపదీసి ఆ యాంకర్ శ్రీముఖి ని మోసం చేసిన వాడు కాదు కదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.