
Pawan Kalyan- Raghuvaran: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఒక సినిమా హీరోగా కంటే కూడా ఒక వ్యక్తిగా ఎక్కువ ఆరాధిస్తారు.కేవలం అభిమానులకు మాత్రమే కాదు, సినీ సెలెబ్రిటీలు కూడా ఆయనని ఒక వ్యక్తిగానే ఎక్కువ ఇష్టపడుతారు.వారిలో లెజెండరీ యాక్టర్ రఘువరన్ కూడా ఒకడు.పాపులర్ విలన్ గా రఘువరన్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగాడు.ఆ రోజుల్లో ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు,అందరిలాగా ఓవర్ డ్రామా లేకుండా చాలా సహజంగా నటించడం రఘువరన్ స్టైల్.
ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి ‘సుస్వాగతం’ మరియు ‘జానీ’ వంటి సినిమాలు చేసాడు.వీటిల్లో సుస్వాగతం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా వీళ్లిద్దరి అద్భుతమైన నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేస్తాది.వాళ్ళ మధ్య నిజమైన తండ్రి కొడుకులు అనే భావన ప్రతీ ఒక్కరిలో కలగడానికి కారణం, వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఉన్న సాన్నిహిత్యమే అని ఇటీవల రఘువరన్ గారి భార్య రోహిణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటల ద్వారా అందరికీ తెలిసింది.
ఆమె మాట్లాడుతూ ‘సుస్వాగతం సినిమా షూటింగ్ మొదటి రోజు పూర్తి చేసి ఇంటికి వచ్చినప్పుడు రఘువరన్ ఈ అబ్బాయిలో ఎదో ఉందమ్మా అని చెప్పాడు.ఆయన ఒక ఆర్టిస్టు గురించి అలా చెప్పడం చాలా అరుదు.అలాంటిది ఒక కొత్త కుర్రాడి గురించి అలా చెప్పేలోపు నేను షాక్ అయ్యాను.చిరంజీవి గారి లాంటి పెద్ద టాలెంట్ ఉన్న స్టార్ హీరో తమ్ముడిగా వస్తున్నదంటే కచ్చితంగా అతని మీద అంచనాలు భారీగానే ఉంటాయి.వాటిని అందుకోవడం చాలా కష్టం, కానీ కళ్యాణ్ గారు చాలా తేలికగా ఆ ఛత్రం నుండి బయటకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరచుకున్నాడు.రఘువరన్ కి పవన్ కళ్యాణ్ తో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది.పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన జానీ మూవీ లో రఘువరన్ నటించాడు’.

‘ఆ సమయం లో రఘువరన్ నాకు ఫోన్ చేసి ‘థిస్ గయ్ ఈజ్ క్రేజీ..వస్తాడు,అలా చెప్తాడు వెళ్ళిపోతాడు, ఏదైనా అంటే అన్నీ మీకు తెలుసు కదా ఏమి పర్లేదు అంటాడు.నా మీద అంత నమ్మకం ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు’ అని రఘువరన్ చెప్పాడు.ఆయన కళ్యాణ్ గురించి అంత గొప్పగా చెప్పినప్పటి నుండి నాకు కళ్యాణ్ గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది.ఆయన ఎందుకు అలా చెప్పాడో, ఇప్పుడు నేను కళ్యాణ్ గారితో పని చేస్తున్నప్పుడు అర్థం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.