https://oktelugu.com/

Harassing Phone Calls: ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతులు.. ఏం జరిగిందంటే?

Harassing Phone Calls: ఆడవాళ్లంటే అందరికి అలుసే. వారితో ఏమవుతుందని చులకనగా చూస్తుంటారు. వారి పట్ల ఏమరుపాటుగానే వ్యవహరిస్తుంటారు. దీంతో వారిని ఏదైనా చేయాలనే ఆలోచన కూడా చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడాళ్లు అబలలు కాదు సబలలు అని నిరూపించారు. వారికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని సమాధానం చెప్పారు. ఒకరు చెప్పు దెబ్బలతో మరొకరు చెంప దెబ్బలతో బుద్ధి చెప్పన సంఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 8, 2022 1:31 pm
    Follow us on

    Harassing Phone Calls: ఆడవాళ్లంటే అందరికి అలుసే. వారితో ఏమవుతుందని చులకనగా చూస్తుంటారు. వారి పట్ల ఏమరుపాటుగానే వ్యవహరిస్తుంటారు. దీంతో వారిని ఏదైనా చేయాలనే ఆలోచన కూడా చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడాళ్లు అబలలు కాదు సబలలు అని నిరూపించారు. వారికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని సమాధానం చెప్పారు. ఒకరు చెప్పు దెబ్బలతో మరొకరు చెంప దెబ్బలతో బుద్ధి చెప్పన సంఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది. మహిళల ఊపు చూస్తుంటే స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

    Harassing Phone Calls

    Harassing Phone Calls

    బిలాస్ పూర్ లోని టోర్వాలో నివసిస్తున్న ఓ వ్యక్తి యువతులకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి వారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అనంతరం వారితో ఉద్యోగాల గురించి మాట్లాడకుండా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు అతడికి బుద్ధి చెప్పాలని భావించారు. ఇదే అదనుగా రోడ్డుపై వెళ్తున్న వారికి అతడు తారసపడి మళ్లీ అదే విధంగా మాట్లాడాడు.దీంతో ఆగ్రహం చెందిన యువతులు అతడిని పట్టుకుని చెప్పు దెబ్బలతో ఒకరు చెంప దెబ్బలతో మరొకరు విరుచుకు పడ్డారు.

    Also Read: KCR Mark: వరి పోరుకు కేసీఆర్ మార్క్ ‘శుభంకార్డ్’ పడనుందా?

    సినిమాల్లో స్పాట్ బాయ్ గా పనిచేసే లాల్ఖదన్ సినీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. మూవీల్లో పని ఇప్పిస్తానని చెప్పి వారితో పరిచయం పెంచుకుని నిరంతరం లైంగిక వేధింపులకు గురిచే్స్తున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు అతడిని అదుపులో ఉంచాలని భావించి ఇలా చేసినట్లు తెలుస్తోంది. మహిళలపై లైంగిక దాడికి పాల్పడేందుకు ఇలా చేయడంతో వారు ఊగిపోయారు. దెబ్బలతోనే సమాధానం చెప్పారు.

    Harassing Phone Calls

    Harassing Phone Calls

    ఉద్యోగం ఎరగా చూపి మోసం చేయాలని చూసిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పారు. మహిళలపై రోజురోజుకు జరుగుతున్న దాడులపై ఇలా అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవచ్చు. మోసగాళ్ల బారిన పడకుండా నిరంతరం జాగ్రత్తగా ఉండే క్రమంలోనే ఇలా అతడికి దేహశుద్ధి చేసి తామేమిటో నిరూపించుకున్నారు. ఆడవారిపై చులకనగా ప్రవర్తిస్తే తగిన బుద్ధి చెబుతామని చెప్పడం విశేషం.

    Also Read:CM KCR: కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. ఏం తేల్చిందంటే?

    Tags