Megastar Chiranjeevi Wife Surekha: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌లో పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను భార్య సురేఖతో కలిసి సత్కరించారు. మహిళల శ్రమను గుర్తించడానికి ఈ రోజు సరైనదన్నారు. చిన్నప్పుటి నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం అన్నారు. తాను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి తన భార్య సురేఖ కారణమని పేర్కొన్నారు.

అయితే, ఏపీలో సినిమా టికెట్ల పెంపు జీవోపై స్పందించేందుకు మెగాస్టార్ చిరంజీవి నిరాకరించారు. “సినిమా టికెట్ల జీవోపై ఇప్పుడు మాట్లాడను.. ఇది సందర్భం కాదు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. జీవో గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతా” అని అన్నారు.
Also Read: పాన్ ఇండియా స్టార్ అయ్యాకే, పొలిటీషియన్ అవుతాడట.
టికెట్ ధరల పెంపు జీవోపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చిరు…ఏపీ సీఎం జగన్‌కు, సినీ పరిశ్రమ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కానీ మరోపక్క ఏపీలో సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలో కొన్ని లొసుగులు ఉన్నట్టు పలువురు సినీ వ్యక్తులు అంటున్నారు.

చిరంజీవి.. మహేష్, ప్రభాస్ లను తీసుకుని వెళ్లి రెండు చేతులు జోడించి వినమ్రంగా వేడుకున్నా జగన్ మనసు మారలేదు. కాస్త అటు ఇటుగా తన శైలి టికెట్ రేట్లను నిర్ణయించి జీవోని విడుదల చేశారు. మరి కొత్త జీవోను బట్టి ఏపీలో సినిమా టికెట్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించింది. గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.20గా నిర్ణయించింది. ఈ రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుంది.
Also Read: ‘మహేష్ – రాజమౌళి’ సినిమాలో హీరోయిన్, విలన్ ఫిక్స్
[…] Anasuya Bharadwaj Tweet: ‘జబర్థస్త్’ యాంకర్ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే, తాజాగా అనసూయ మహిళా దినోత్సవాన ట్రోలర్స్‌కి షాకిచ్చేలా ట్వీట్ చేసింది. […]