
South Africa Vs West Indies: టి20 లు అంటేనే రికార్డులకు మారుపేరు. ఈరోజు ఉన్న రికార్డు మరో రోజుకు ఉండదు. పరుగుల వరద పారే ఈ టి20 మ్యాచ్ లు అంటే అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా దక్షిణాఫ్రికా – వెస్టిండీస్ మధ్య మరో రికార్డు స్థాయి మ్యాచ్ జరిగింది. 258 భారీ పరుగుల లక్ష్యాన్ని చేదించిన దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ రికార్డును నమోదు చేసింది.
టీ20 ల్లో సరికొత్త రికార్డు నమోదయింది. అసలు అంచనాల్లేని దక్షిణాఫ్రికా జట్టు దాన్ని రియాల్టీలో చేసి చూపించింది. దీంతో క్రికెట్ ప్రేమికులు షాక్ అవుతున్నారు. అసలు ఈ రేంజ్ బ్యాటింగ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అని మాట్లాడుకుంటున్నారు.
క్రికెట్లో టి20 మ్యాచ్ లు సరికొత్త ఊపిన తీసుకొచ్చాయి. ఆటలో వేగం పెంచాయి. 2007 t20 ప్రపంచ కప్ తో మొదలైన ఈ ధనాధన్ ఆట.. ప్రస్తుతం అయితే ఇదే ముఖ్యం అన్నంతగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా టెస్టు, వన్డేలకంటే 20 ఓవర్ల గేమ్ చూడడానికే బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే టీ20ల్లో అప్పుడప్పుడు సరికొత్త రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. కానీ తాజాగా దక్షిణాఫ్రికా మాత్రం ఏ జట్టుకు సాధ్యం కానీ అరుదైన ఘనత సాధించింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాతో పాటు క్రికెట్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.
అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా..
టి20 లో అత్యధిక స్కోర్లు చేయడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టి20 లోనూ సరికొత్త ఘనత నమోదయింది. తులత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగులు భారీష్ కూర చేసింది. దీంతో సఫారీ బ్యాటర్లకు కష్టమని అనుకున్నారు. కానీ ఓపన డికాక్ మాస్ జాతర చూపించాడు. 44 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ కూడా ధనాధన్ ఆటతో 68 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ మాస్ బ్యాటింగ్ తో 18.5 ఓవర్ లోనే దక్షిణాఫ్రికా జట్టు భారీ లక్ష్యాన్ని చేదించింది.
అత్యధిక లక్ష్య సాధనగా రికార్డ్..
ఇప్పటి వరకు టి20ల్లో అత్యధిక లక్ష్య సాధన 245 పరుగులు మాత్రమే ఉంది. 2018లో న్యూజిలాండ్ పై t20 లో ఆస్ట్రేలియా 245 పరుగులు లక్ష్యాన్ని పూర్తి చేసింది. రికార్డు ఇప్పటివరకు కొనసాగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు దీన్ని చేదించింది. వరల్డ్ రికార్డు నెలకొల్పింది.. ఇప్పటి వరకు వెండి బ్యాటర్లు.. ఇతర జట్లపై రన్స్ కొట్టడం.. లక్ష్యాలను చేదించడం చూసాం. కానీ ఆ టీం పైనే దక్షిణాఫ్రికా రెచ్చిపోయేసరికి అందరూ మెంటలెక్కిపోయారు. సరిగ్గా ఐపీఎల్ కు కొన్ని రోజులు ముందు ఇలాంటి రికార్డు సెట్ అయ్యేసరికి.. డేకాక్ పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. మరి టి20 లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించడంపై పలువురు క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అరవీర భయంకరమైన బ్యాటింగ్..
ఈ టి20 మ్యాచ్ లో రెచ్చిపోయిన క్వింటన్ డీకాక్ అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. మ్యాచ్ ఎక్కడైనా, బౌలర్ ఎవరైనా.. చూడకుండా బ్యాటింగ్ చేయడం, తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకు పడడం ఢీకాక్ కు మాత్రమే సొంతం. ఏ దేశంలోనైనా, ఏ టీమ్ తో అయినా వేగంగా పరుగులు చేయడమే లక్ష్యంగా డీకాక్ బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు అదే బ్యాటింగ్ తీరుతో దక్షిణాఫ్రికాకు రికార్డు స్థాయి విజయాన్ని అందించి పెట్టాడు.