https://oktelugu.com/

Viral Video: తల్లి వీపుపై తనయుడు.. ఈ తల్లి కష్టానికి సెల్యూట్ చేయాల్సిందే.. వైరల్ వీడియో

రోడ్డుపై ఓ తల్లి వెళ్తోంది.ఆ తల్లికే నడవడం కష్టంగా మారింది. నడుం పూర్తిగా వంగిపోవడంతో ఊత కర్రల సాయంతో వెళ్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా తన బిడ్డ బాగుండాలని తన నడుంపై తన కుమారుడు ఎక్కించుకొని మరీ వెళ్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 9, 2023 / 03:59 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video: సృష్టిలో తల్లికి మించిన దైవం లేదంటారు.. దేవుడు అన్ని చోట్ల ఉండలేక.. అమ్మరూపంలో అక్కడక్కడా ఉంటాడంటారు… చెడ్డ నాన్న గురించి విన్నాం గానీ.. చెడ్డ తల్లలు గురించి చాలా అరుదుగా వింటుంటాం.. ఎందుకంటే ఎంత కష్టమొచ్చినా తన బిడ్డల శ్రేయస్సు కోసం తల్లి ప్రాథేయపడుతుంది. తన ప్రాణం పోయినా సరే.. బిడ్డలు బాగుండాలని కోరుకుంటుంది.. అలా ఓ తల్లి తాను నడవలేని స్థితిలో ఉన్నా.. తన బిడ్డ బాగుండాలని ప్రాణాలకు తెగించిన సాహసం చేసింది… తాను ఏ స్థితిలో ఉన్నా.. తన బిడ్డ సంతోషం కోసం ఏ తల్లీ పడలేని కష్టం పడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    రోడ్డుపై ఓ తల్లి వెళ్తోంది.ఆ తల్లికే నడవడం కష్టంగా మారింది. నడుం పూర్తిగా వంగిపోవడంతో ఊత కర్రల సాయంతో వెళ్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా తన బిడ్డ బాగుండాలని తన నడుంపై తన కుమారుడు ఎక్కించుకొని మరీ వెళ్తోంది. ఈ పరిస్థితలుల్లో అభం, శుభం తెలియని ఆ బాలుడు మాత్రం ఎంతో ఆనందంగా పుచ్చకాయ తింటూ ఉంటోంది. కానీ తన బిడ్డ నవ్వే తనకు బలంగా ఊత కర్రల సాయంతో ముందుకు పోతుంది. తాను నడవలేను అని తెలిసినా తన బిడ్డ బాగు కోసం ఎంతో సాహసం చేసింది.

    ఈ పరిస్థితిని చూసిన ఒకతను ఆ తల్లికీ డబ్బులు ఇవ్వడానికి మందుకు వచ్చాడు. కానీ ఇదే సమయంలో @RobertLyngdoh2 అనేవ్యక్తి అటునుంచి వెళ్తుండగా ఈ హృదయవిదారక దృశ్యం కనిపించింది. వెంటనే ఆ సీన్ ను వీడియో తీసి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షకు పైగా వీక్షించారు. సమాజంలో తల్లికి మంచి గురువు లేదంటారు. కానీ తల్లికి మంచి దైవం లేదు.. అని ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు.