Solo Life: అర్ధశతాబ్దం క్రితం వరకు ఉమ్మడిగా జీవనం(Jont Familes) సాగించేవారు. ఉమ్మడి కుటుంబాలకే ప్రాధాన్యం ఉండేది. కుటుంబంతో కలిసి లేరు అంటే ఏదో తప్పు చేసినట్లుగా భావించేవారు. తర్వాత ఉద్యోగాలు, ఉపాధి వేటలో చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దాదాపు కనుమరుగయ్యాయి. ఇప్పుడు చిన్న కుటుంబాల కాలం సాడుస్తోంది. రాబోయే రోజుల్లో చిన్న కుటుంబాలు(Small Familyes) కూడా కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వైవాహిక బంధాలు ఎక్కువకాలం నిలవడం లేదు. దంపతుల మధ్య గొడవతో విడిపోవడం.. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడంతో విసిగిపోతున్నారు. ఒంటరిగా జీవించడమే మేలని భావిస్తున్నారు. నేటితరం యువతలో ఈ భావన కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో విస్తృతంగా వ్యాపిస్తే.. సోలో(Solo) కుటుంబాలు పెరుగుతాయి. అయితే సోలో లైఫ్ అనేది తన స్వంత నిర్ణయాల్ని తీసుకునే, స్వతంత్రంగా జీవించే ఒక విధానం. ఈ జీవనశైలిలో, వ్యక్తి ఇతరుల మీద ఆధారపడకుండా, తనకు కావాల్సిన అన్ని విషయాలు సొంతంగా నిర్వహించుకుంటాడు.
తగ్గుతున్న అనుబంధాలు..
చాలా మంది ప్రేమ, పెళ్లి అని పరిగెడుతుంటే.. కొంత మంది మాత్రం సోలో లైఫే బెటర్ అంటూ సింగిల్గా ఉండటానికే ఇష్టపడుతుంటారు. పెళ్లి, రిలేషన్షిప్ జోలికే పోరు. ఒంటరి జీవితమే చాలా హ్యాపీగా ఉందని ఫీలవుతుంటారు. ఈ ఆలోచనాతీరుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు.
= ప్రేమించిన వారు, పెళ్లి చేసుకున్నవారు వదిలేయడం, మోసం చేయడం వల్ల.. మళ్లీ మరొకరిని నమ్మి రిలేషన్షిప్ కొనసాగించడానికి కొందరు ఇష్టపడరు. గత జ్ఞాపకాలతో సింగిల్గానే బతికేయడానికి ఇష్టపడతారు.
= కొందరి మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. వారు ఎవ్వరినీ నమ్మరు. రొమాంటిక్ లైఫ్ తమకు వద్దనుకుంటారు. అందుకే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతామని భావించి ఒంటరిగానే బతికేస్తుంటారు.
= కొందరు తమ భాగస్వామి విషయంలో చాలా ఊహించుకుంటారు. తమ జీవితంలోకి వచ్చేవారు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో అంచనాలు వేసుకుని చివరికి అనుకున్నవారు దొరక్కపోయే సరికి ఒంటరిగానే మిగిలిపోతారు.
సోలో లైఫ్ ప్రయోజనాలు:
1. స్వతంత్రత: మీరు ఏం చేయాలనుకుంటున్నా, ఎప్పుడు చేయాలనుకుంటున్నా నిర్ణయం తీసుకోవడంలో పూర్తిగా స్వతంత్రంగా ఉంటారు.
2. ఆత్మసంతృప్తి: ఇతరులపై ఆధారపడకుండా, మీరు మీ ఇష్టాలకు అనుగుణంగా జీవిస్తారు, తద్వారా ఆత్మసంతృప్తి పెరుగుతుంది.
3. ఆత్మవిశ్వాసం: మీరు ప్రతీ నిర్ణయం తీసుకోవడంలో స్వయంగా అభ్యసిస్తారు, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
4. పూర్తి స్వేచ్ఛ: మీరు ఎలాంటి సమయ ప్రణాళికలతో, బంధాలతో జయించకుండా స్వేచ్ఛగా జీవించవచ్చు.
5. వ్యక్తిగత అభివృద్ధి: మీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇది వ్యక్తిగత వృద్ధికి దారి తీస్తుంది.
సోలో లైఫ్‌లో వచ్చే సవాళ్లు:
1. మానసిక ఒత్తిడి: సొంతగా జీవితాన్ని నిర్వహించుకోవడం కొంతమంది వ్యక్తులకు ఒత్తిడిగా ఉండవచ్చు.
2. సంగతి లోపం: సోలో జీవనం చాలామంది ఆత్మీయ సంబంధాలను అనుభవించలేక పోవడం వల్ల నిరాశగా అనిపించవచ్చు.
3. సహాయం లేకపోవడం: అవసరమయినపుడు ఇతరుల సహాయం లేకపోవడం కొంతమందికి సమస్యగా మారవచ్చు.