Gaza : డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. గాజాలో ఉన్నటువంటి 10 లక్షల మంది జనాభాను జోర్డాన్, ఈజీప్ట్ తీసుకోవాలని కోరారు. గాజాను ఒక దుబాయ్ లాంటి నగరాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వాస్తవానికి భారత్ లో రాజకీయ పార్టీలు చెప్పినట్టుగా.. పాలస్తీనా దేశం నుంచి వారిని వెళ్లగొట్టే కుట్రగానే దీన్ని చూస్తున్నారు.
చరిత్ర చూస్తే.. పాలస్తీనా దేశం నుంచి వారిని బయటకు పంపి.. యూదులు వచ్చి ఇజ్రాయెల్ ను స్థాపించారు. అసలు ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశమే లేదు. ఒట్టమాన్ సామ్రాజ్యం కింద ఈ ప్రాంతం కూడా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన మార్పుల్లో ఇది బ్రిటీష్ సామ్రాజ్యం కింద ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం మారణహోమంలో యూదులు భారీగా ఊచకోతకు గురయ్యారు. యూదులు తమకు దేశం కావాలని ఇజ్రాయెల్ లో స్థిరపడ్డారు. పాలస్తీనీయులను కలుపుకొని పోయారు. వారితో కలిసి ఆధునిక యుద్ధం చేశారు. అయితే అరబ్ దేశాలు రెచ్చగొట్టి పాలస్తీనీయులను ఇజ్రాయెల్ పై యుద్ధాలు చేశారు. అరబ్ కంట్రీల వల్ల నష్టపోయింది పాలస్తీనా వాసులే.. ప్రతీసారి యుద్ధంలో నష్టపోయింది పాలస్తీనానే..
గాజా చుట్టుపక్కలా ఉన్నదంతా ఇజ్రాయెల్ నే.. ఇజ్రాయెల్ నుంచే ప్రతీ అవసరం గాజాకు వెళ్లాలి. గాజాకు ఎప్పటికైనా ఒక పరిష్కారం కావాలి. దీనికి ట్రంప్ సూచన ఆమోదయోగ్యం కాదు.. వెస్ట్ బ్యాంకు లో పాలస్తీనీయులను ఉంచడం మంచి పరిష్కారం..
చరిత్రలో అతిపెద్ద జనాభా బదలాయింపు భారత్ విభజన సమయంలో.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.