Social media : సోషల్ మీడియా వాడకంలో యువతదే అగ్రస్థానం. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, స్నాప్ చాట్.. ఇలా ఎన్ని రకాల సోషల్ మీడియా యాప్స్ ఉన్నప్పటికీ.. యువత ఇంకా ఏదో కొత్తదనాన్ని కోరుకుంటున్నది. పలకరింపులు..లైక్ లు, షేరింగ్ లు మాత్రమే కాదు లక్షలలో సంపాదనకు యువత సోషల్ మీడియా మంత్రాన్ని వల్లే వేస్తోంది. సోషల్ మీడియాలో యువత ఏదైనా ఫోటో లేదా.. తమ భావాన్ని పోస్ట్ చేసిందంటే.. అత్యధికులను చేరడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో చేసిన ప్రతి పోస్ట్ అత్యధిక మందిని చేరదు. దానికంటూ ఒక సమయం ఉంటుంది. అప్పుడే రీచ్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెలబ్రిటీలకు ఇది వర్తించదు..
Also Read : ఆదేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. మన దేశంలోనూ రావాలి..!
ఎప్పుడు పోస్ట్ చేయాలంటే
ఫేస్ బుక్.. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ కు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. అయితే దీనిని జనరేషన్ జెడ్ తరం అంతగా వాడటం లేదు. వారంతా కూడా ఇన్ స్టా గ్రామ్, వాట్సప్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇక మిగతా రోజులతో పోల్చితే వీకెండ్ దగ్గరగా ఉన్న సమయంలోనే యువత ఫేస్ బుక్ పోస్టులను ఎక్కువగా చూస్తున్నది. గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు వీరు పోస్టులు ఎక్కువగా చూసే అవకాశం ఉంది.
ఇన్ స్టా గ్రామ్
ఇన్ స్టా గ్రామ్ ను గతంతో పోల్చితే ఇటీవల కాలంలో దానిని చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. అభిమాన నటులు ఏం పోస్ట్ చేశారు.. ఇలాంటి వీడియోలు పెట్టారు.. వంటి వాటిని చూసేందుకు యువత ఎక్కువగా ఇన్ స్టా గ్రామ్ సెర్చ్ చేస్తున్నారు.. అయితే కార్పొరేట్ కంపెనీలు ఇన్ స్టా గ్రామ్ ను తెగ వాడుకుంటున్నాయి. కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను.. తమ ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను సోమవారం పోస్ట్ చేస్తున్నాయి.
ట్విట్టర్ ఎక్స్
సూటిగా సుత్తి లేకుండా చెప్పే ట్విట్టర్ ఎక్స్ ను తక్కువ మంది వాడుతుంటారు. ఎక్కువగా యువత, ఇంటెలిజెన్స్ పీపుల్ దీనిని ఉపయోగిస్తుంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆరు గంటల వరకు ట్విట్టర్ ఎక్స్ కు పరితమైన ట్రాఫిక్ ఉంటుంది. దానివల్ల ఎటువంటి సమయంలో పోస్ట్ లు చేయాలో దానికి అనుగుణంగా సమయాన్ని ఎంచుకోవచ్చు.
టెలిగ్రామ్
టెలిగ్రామ్ యాప్ లో అత్యధికంగా ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఉంటుంది. యూట్యూబ్ వీడియోలు.. ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ లకు సంబంధించి లింక్ లు కూడా ఇందులో పెడుతుంటారు. అయితే ఇందులో వీకెండ్ లో అత్యధికంగా పోస్టులు నమోదు అవుతుంటాయి. జనరేషన్ జెడ్ తరం కూడా ఇందులో ఎక్కువగా పోస్టులు చూస్తూ ఉంటుంది. అయితే టెలిగ్రామ్ ను చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వాడుకునేవారు పెరిగిపోవడంతో.. వీటిని ఉపయోగించే వారిపై టెలికాం శాఖ ఒక కన్ను ను వేసే ఉంచింది.
Also Read : ఆ ముగ్గురూ సినీ పరిశ్రమకు గుణపాఠమే