
Allu Arjun- Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లుడిగా వస్తానంటే ఎవరైనా వద్దంటారా? స్నేహారెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి మాత్రం నో అన్నారట. స్నేహారెడ్డితో అల్లు అర్జున్ వివాహానికి ముందు చాలా తతంగమే నడిచిందట. స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. తరచుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మొదట స్నేహం ఆపై ప్రేమగా బంధం బలపడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని బన్నీ, స్నేహారెడ్డి అనుకున్నారు. మొదట అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కి స్నేహారెడ్డిని ప్రేమిస్తున్న విషయం చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని సూటిగా తన నిర్ణయం పేరెంట్స్ ముందు పెట్టాడు. బన్నీ నిర్ణయాన్ని గౌరవించిన అల్లు అరవింద్… సంబంధం మాట్లాడటానికి స్నేహారెడ్డి ఇంటికి వెళ్లారట. స్నేహారెడ్డి ఫాదర్ శేఖర్ రెడ్డిని కలిసి పిల్లను అడిగారట.
శేఖర్ రెడ్డి ఈ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించారట. మీరు ఏమీ అనుకోవద్దు. సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వడం నాకు ఇష్టం లేదన్నారట. అల్లు అరవింద్ మనసు మార్చేందుకు ప్రయత్నం చేసినా ఆయన వినలేదట. చేసేదేమీ లేక అల్లు అరవింద్ తిరిగి వచ్చేశారట. అదే విషయం కొడుకు బన్నీకి చెప్పాడట. స్నేహారెడ్డి తండ్రి నిర్ణయం అల్లు అర్జున్ ని బాగా హర్ట్ చేసిందట.

అయితే స్నేహారెడ్డి గట్టి పట్టుబట్టారట. పెళ్లంటూ చూసుకుంటే బన్నీనే చేసుకుంటానని తండ్రికి చెప్పేసిందట. కొన్నాళ్ళ పాటు స్నేహారెడ్డిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నం చేసిన శేఖర్ రెడ్డి ఆమె ఒప్పుకోకపోవడంతో, పెళ్ళికి ఒప్పుకున్నారట. 2011 మార్చి 6న అల్లు అర్జున్-స్నేహారెడ్డి మ్యారేజ్ ఘనంగా జరిగింది. ఆ విధంగా అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రేమ కథ సుఖాంతం అయ్యింది. అప్పుడు బన్నీని వద్దన్న శేఖర్ రెడ్డి ఇప్పుడు మా అల్లుడు పాన్ ఇండియా స్టార్. నార్త్ లో కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నారంటూ గొప్పగా ఫీలవుతున్నారు. అల్లు స్నేహారెడ్డికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి అయాన్ కి 9 ఏళ్ళు, అమ్మాయి అర్హకు 6 ఏళ్ళు వచ్చాయి.