Snake Venom: పాము పేరు వినగానే మనలో తెలియని భయం కలుగుతుంది.. ఇక పాము ప్రత్యక్షంగా కనిపిస్తే హడలిపోతాం. కానీ కొంత మంది పామును పట్టుకుని దాని నుంచి విషయం తీసి విక్రయిస్తున్నారు. పాము విషంతో ఏం చేస్తారు.. దాని విలువ ఎంత ఉంటుంది అన్న సందేహాలు కలుగుతాయి. కానీ పాము విషయం చాలా ఖరీదైంది. తాజాగా బంగ్లాదేశ్ నుంచి ఇద్దరు రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని భారత్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పాము విషం ఎందుకు అంత కాస్ట్‌లీ.. ఏ పాము విషం ఎక్కువ ఖరీదు.. ఎందుకు అంత ఖరీదు అన్న చర్చ జరుగుతోంది.
ఏటా 1.30 లక్షల మంది పాము కాట్లకు బలి
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 81,000 మంది నుంచి 1,38,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ అంచనా ప్రకారం.. ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు. అయితే వారిలో కేవలం సగం మందికే పాము విషం ఎక్కుతోంది. పాము కాట్ల కారణంగా అంధత్వం మొదలుకుని అవయవాలు తొలగించటం వరకూ.. వేలాది మంది శాశ్వత వైకల్యానికి లోనవుతున్నారు.
విషమే విరుగుడు..
పాము కరిచినప్పుడు విష ప్రభావం నివారణకు యాంటీ వీనమ్ వేగంగా ఎక్కించాలి. కానీ.. పాము కాట్లు అధికంగా ఉండే చాలా దేశాల్లో సొంతంగా యాంటీవీనమ్ ఉత్పత్తి చేసే సదుపాయాలే లేవు. పాము విషయం విరుగుడుకు వాడే యాంటీవీనం కూడా పాముల విషంతోనే తయారు చేస్తారు. అంటే.. విషమే విషానికి వరుగుడు అన్నమాట.
అందుకే కాస్ట్‌లీ..
పాము విషయం సాధారణంగా దొరకదు.. నాగు పాము విషానికి ఖరీదు ఎక్కువ. భారత కరెన్సీలో నాగుపాము ఒక గ్రాము విలువ రూ.4 వేలు ఉంది. ఇక, భూమి మీద సంచరించే పాములన్నిటిలోకీ.. ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము అత్యంత విషపూరితమైనది. దీని విషం గ్రాము విలువ రూ.10 వేలు.
సంప్రదాయ మందుల తయారీ..
పాముల విషయంతో చైనీయులు సంప్రదాయ మందులు తయారీ చేస్తున్నారు. అందుకే పాముల విషాన్ని చైనీయులు బాగా కొనుగోలు చేస్తారు. పాములను చంపి విషం తీస్తారు. అందుకే ఫ్రాన్స్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ నుంచి కూడా పాముల విషం చైనాకు తరలిస్తుంటారు. ఖరీదైన విషాన్ని చైనీయులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.