Homeట్రెండింగ్ న్యూస్Smita Sabharwal: ఫ్యాషన్ ఆఫ్ ఐఏఎస్’: స్మిత సబర్వాల్ పిక్స్ వైరల్..

Smita Sabharwal: ఫ్యాషన్ ఆఫ్ ఐఏఎస్’: స్మిత సబర్వాల్ పిక్స్ వైరల్..

Smita Sabharwal: ప్రభుత్వ అధికారులు అంటే నిత్యం బిజీగా ఉంటారు. ఏదో ఒక పనిలో తలమునకలై ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది మహిళా అధికారిణులు పర్సనల్ విషయాలు పట్టించుకోరు. ముఖ్యంగా అందం విషయాన్ని అస్సలు లెక్కచేయరు. సాదాసీదాగా ఉంటూ తమ పని చేసుకుంటూ పోతారు. కానీ కొంతమంది అధికారిణులు ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు పర్సనల్ విషయాల్లోనూ కేర్ తీసుకుంటున్నారు. లేటేస్టుగా తెలంగాణలో ఉన్నతాధికారిణి అయిన స్మితా సబర్వాల్ అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె టూర్ ప్లేసులకు వెళ్లినప్పుడు అక్కడ తీసుకున్న ఫొటోలను తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేయడంతో అవి నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సీఎంలో ఉండే కీలక అధికారుల్లో ఆమె ఒకరు. 1977 జూన్ 19న డార్జిలింగ్ లో జన్మించారు. 2004లో అకున్ సబర్వాల్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి నానక్, భువిస్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ హైస్కూల్ లో చదువు పూర్తి చేసిన స్మిత ICSE పరీక్షలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. ఆ తరువాత ప్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె 20 ఏళ్ల వయసులోనే UPSC ఎగ్జామ్ లో విన్నర్ అయ్యారు.

2001 బ్యాచ్ కు చెందిన స్మిత తెలంగాణ కేడర్ లో కెరీర్ స్టార్ట్ చేశారు. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి తన పనితీరును మెరుగు పర్చుకున్నారు. కచ్చితమైన ప్రణాళికలు చేస్తూ మిగతా అధికారుల కంటే ముందు వరుసలో ఉన్నారు. సీఎంలో నియమితులైన మొదటి మహిళా అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు.అధికారిక కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్న పర్సనల్ విషయాలను కూడా పట్టించుకుంటారు.

ముఖ్యంగా అందం విషయంలో స్మితా సబర్వార్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తోటి అధికారిణిలతో పాటు మిగతా సెలబ్రెటీలతో ఆమె దిగిన ఫొటోలో తన ఇస్ స్ట్రాగ్రామ్ లో ఉంచారు. అయితే కెరీర్ బిగినింగ్ లోనే ఆమెపై కొందరు అనుచిత వార్తలు రాశారు. దీంతో సీరియస్ అయిన ఆమె వారిపై చర్యలు తీసుకునేదాకా వదల్లేదు. నిత్యం మహిళలు, పిల్లల హక్కులపై పోరాటాలు చేసే ఆమెకు లేటేస్టుగా గోవాకువెళ్లిన ఫొటోలు హైలెట్ గా నిలుస్తున్నాయి.

కొందరు ఈ ఫొటోలపై రకరకాల కామెట్లు చేస్తున్నారు. ‘భూమి మీదకు వచ్చిన సిండ్రెల్లా’ అని ఒకరు కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. డ్యూటీ, డెడికేషన్ మాత్రమే కాదు.. లైఫ్ స్టైల్ కూడా చక్కగా మెయింటేన్ చేస్తున్న మేడం కు సలాం.. అంటూ మరికొందరు కొనియాడుతున్నారు. దేశంలో ఎంతో మంది యువతులకు రోల్ మోడల్ గా నిలుస్తున్న స్మిత పిక్స్ వైరల్ గా మారాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular