Heroine Sanghavi: కన్నడ అమ్మాయి అయిన సంఘవి తెలుగులో స్టార్డమ్ తెచ్చుకున్నారు. 1995లో విడుదలైన తాజ్ మహల్ మూవీతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో శ్రీకాంత్ హీరో. తర్వాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది. సమరసింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. 2005 వరకు సంఘవి బిజీ యాక్ట్రెస్ గా ఉన్నారు. ఆంద్రవాలా మూవీలో ఎన్టీఆర్ భార్యగా నటించడం విశేషం.
సంఘవి తెలుగులో చివరిగా నటించిన చిత్రం ఒక్కడే కానీ ఇద్దరు. 2008 తర్వాత ఆమె కెరీర్ డల్ అయ్యింది. ఆఫర్స్ తగ్గిపోయాయి. దాంతో బ్రేక్ తీసుకుంది. 2016లో ఐటీ ప్రొఫెషనల్ అయిన వెంకటేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి కాగా బెంగుళూరులో సెటిల్ అయ్యింది. సంఘవి కనిపించి చాలా కాలం అవుతుంది.
రీసెంట్ గా ఆమె తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భర్త వెంకటేష్, కూతురితో పాటు తిరుమల రావడం జరిగింది. వివాహం అయ్యాక సంఘవి ఒళ్ళు చేశారు. ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు. అయితే బరువు పెరిగారు. సాధారణంగానే సంఘవి బొద్దుగా ఉండేది. పెళ్లయ్యాక ఆమె మరింత లావయ్యారు. దాంతో గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు. ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు.
తిరుమలలో సంఘవిని చూసిన జనాలు ఫోటోలు దిగేందుకు ఎగబట్టారు. అభిమానుల కోరిక కాదనకుండా సంఘవి వారితో ఫోటోలు దిగారు. సంఘవిని చాలా మంది తెలుగు అమ్మాయే అనుకునేవాళ్లు. ఆమె లుక్ కూడా అలానే ఉండేది. టాప్ హీరోయిన్ కాకపోయినా స్టార్స్ పక్కన ఛాన్స్ దక్కించుకున్నారు. సంఘవి కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేయడం విశేషం.