Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు.. దానికి తెలుగులోనే కాదు, ఏ భాషల్లో కూడా సరైన పదాలు లేవు. కానీ ఇప్పుడు ఆ ప్రమాదకర ధోరణి విపరీతంగా పెరుగుతుంది. అది కాస్త దంపతుల మధ్య అగాధాన్ని విపరితంగా సృష్టిస్తోంది. ఈ విపత్తు మనదేశంలో దారుణంగా పెరిగిపోతుంది. ఫలితంగా చాలావరకు కుటుంబాలు తెలియని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి..
వైవాహిక బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య సుఖ సంసారం చక్కగా ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడా కొట్టిన సరే.. మొత్తం తేడా అవుతుంది. గతంలో మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్లీప్ డైవర్స్ అనే ధోరణి భార్యాభర్తల మధ్య కనిపిస్తోంది. ఫలితంగా దంపతుల మధ్య ఊహించని మానసిక సమస్యలు.. శారీరక సమస్యలు.. ఇంకా అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి..
ఇటీవల మానసిక నిపుణులు నిర్వహించిన ఓ సర్వేలో స్లీప్ డైవర్స్ గురించి దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఇందులో భారత్ మొదటి స్థానంలో ఉందని తేలింది.. ఇది క్రమేపి మన వివాహ వ్యవస్థను నాశనం చేసే దిశగా మారుతోందని మానసిక నిపుణులు హెచ్చరించారు..
స్లీప్ డైవర్స్ అనేది ఇంగ్లీష్ పదం. దీనిని తెలుగులో చెప్పాలంటే కలిసి ఉంటూనే.. ఎవరికివారు పడుకోవడం అని అర్థం.. చాలామంది దంపతుల్లో బయటికి చూస్తే అన్యోన్యత అద్భుతంగా కనిపిస్తుంది. పడకగదికి వెళ్లేసరికి అది మాయమవుతుంది. నీకు నువ్వే.. నాకు నేనే అన్నట్టుగా వ్యవహారం మారిపోతూ ఉంటుంది. ఎవరి బెడ్ రూమ్ వారికి ఉంటుంది. ఎవరికి వారు తలుపులు వేసుకొని నిద్రిస్తుంటారు. వాస్తవానికి అన్యోన్యమైన కాపురం అంటే పదిమంది ముందు బిల్డప్ ఇవ్వడం కాదు.. పదిమంది చూస్తుండగా చిలక గోరింకల్లాగా నటించడం కాదు.. పడకగదిలో కూడా కలిసి ఉండడం.. ఆనందంగా శృంగారంలో పాల్గొనడం.. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో కీలకమైన హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఏకాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సమస్యల గురించి ప్రస్తావన వస్తుంది.. అక్కడే వాటి పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది. అంతేతప్ప.. ఎవరికి వారుగా నిద్రిస్తే మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్లీప్ డైవర్స్ పెరిగిపోవడానికి ప్రధానంగా అనే కారణాలు ఉన్నాయి. నగరాలలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేసి సాయంత్రం పూట ఇంటికి వచ్చే సమయానికి అలసిపోతున్నారు. దీంతో సుఖవంతమైన నిద్రను కోరుకుంటున్నారు. కొందరిలో గురక సమస్య కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. అందువల్లే చాలామంది దంపతులు స్లీప్ డైవర్స్ వైపు వెళ్తున్నారు. సంసారం విషయంలో అన్యోన్యతను ప్రదర్శిస్తున్నప్పటికీ.. సుఖాన్ని మాత్రం దూరంగా ఉంచుతున్నారు. అనేక రకాల రోగాలకు దగ్గరవుతున్నారు.