Sixth Ocean On Earth: ఈ భూమి మీద మూడో వంతు నీరే ఉందని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. మహాసముద్రాలు కూడా ఐదు ఉన్నాయని తెలుసుకున్నాం. అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్, ఆర్కిటిక్, దక్షిణ మహా సముద్రం సరసన ఇప్పుడు మరొకటి చేరబోతున్నది. ఇది భూమి ఎగువ, దిగువ పొరల మధ్య గణనీయమైన పరిమాణంలో ఉన్న రుజువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి ఉపరితలం నుంచి 660 కిలోమీటర్ల దిగువన ఏర్పడిన వజ్రం గురించి శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “ఇది సముద్రపు నీటికి సంబంధించిన స్లాబ్ లను ఉప సంహరించుకుంటున్నది. తద్వారా పరివర్తన జోన్ లోకి ప్రవేశిస్తున్నది. భూమి నీటి చక్రం దాని లోపలి భాగాన్ని కలిగి ఉంటున్నదని” శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

– జర్మన్ ఇటాలియన్ అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం
ఆరవ సముద్ర అన్వేషణకు సంబంధించి చేసిన అధ్యయనం నేచర్ జర్నల్ లో ఇటీవల ప్రచురించారు. దీని ప్రకారం ఇది భూమి అంతర్గత నిర్మాణం, డైనమిక్స్ మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ కు దిగువ పొర మధ్య 660 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. భూమి ఎగువ, దిగువ పొరలను వేరు చేసే సరిహద్దు పొర లోని పరివర్తన జోన్ లో ఆరవ మహాసముద్రానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీన్ని సరిహద్దు 410 నుంచి మండల 660 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇక్కడ 23 వేల బార్ల వరకు అపారమైన పీడనం, ఆలివ్ గ్రీన్ ఖనిజం స్పటిక రూపంలో మారేందుకు కారణమవుతోంది. అలివిన్ భూమి ఎగువ పొరలో 70 శాతం వరకు ఉంటుంది. దీనిని పెరి డో ట్ అంటారు. పరివర్తన జోన్ ఎగువ సరిహద్దు వద్ద, సుమారు 410 కిలోమీటర్ల లోతులో దట్టమైన వాడ్స్ లే లైట్ గా మారుతున్నది. 520 కిలోమీటర్ల వద్ద అది మరింత దట్టమైన రింగ్ ఉ డై ట్ గా రూపాంతరం చెందుతోంది. ” ఈ ఖనిజ పరివర్తనలు భూమి పొరలోని రాతి కదలికలకు చాలా ఆటంకం కలిగిస్తాయి. సబ్ డక్టింగ్ ప్లేట్లు తరచుగా మొత్తం పరివర్తన జోన్ ను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బంది పడతాయి. ఐరోపా దిగువన ఉన్న ఈ జోన్ లో ఇటువంటి ప్లేట్లు ఒక స్మశాన వాటిక మాదిరి ఉన్నాయని” గో తే యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ జియో సైన్సెస్ ప్రొఫెసర్ ఫ్రాంక్ బ్రెంకర్ వివరించారు.
Also Read: Atharintiki Daaredi: అత్తారింటికి దారేది సినిమాలో పది సీక్రెట్లు ఉన్నాయి.. అవేంటో తెలుసా?
_ ఇప్పటివరకు ఏమేమి కనుగొన్నారంటే
పరివర్తన జోన్, భూమి దిగువ పొర ఉపరితల వ్యాసార్థం నుంచి 660 కిలోమీటర్ల దిగువన ఏర్పడిన వజ్రాన్ని బోట్స్వానా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. రామన్ స్పెక్ట్రోస్కోపీ, ఎఫ్ టి ఐ ఆర్ స్పెక్ట్రోమెట్రీ ని ఉపయోగించి వజ్రం ఎలా ఏర్పడుతుందో కనుగొన్నారు. అదే సమయంలో వజ్రం విశ్లేషణ, నీటి రింగ్ వుడైట్ చేరికలను పరిశీలించారు. వజ్రంలో 1.5 సెంటీమీటర్ల చేరికలు ఖచ్చితమైన రసాయన కూర్పును వెల్లడిస్తున్నాయి. పరివర్తన జూన్ పొడి స్పాంజ్ కాదని ఈ బృందం ధృవీకరించింది. గణనీయమైన మొత్తంలో నీటిని కలిగి ఉంది. గతంలో భూమి పొరల్లో సముద్రం దాగి ఉందని జూల్స్ వెర్న్ అనే శాస్త్రవేత్త వెల్లడించాడు. అయితే ప్రస్తుత ప్రయోగంలో వెల్లడవుతున్న విషయాలు ఆయన ఆలోచనకు దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ట్రాన్సిషన్ జోన్ అధిక నీటి వ్యాసార్థం భూమి లోపల డైనమిక్ పరిస్థితికి చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది.

ఒకవేళ ఆ పరిణామాన్ని విచిన్నం చేయగలిగితే అది క్రస్టులో భారీ కదలికకు దారి తీయవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూ పొరల్లో కదలికల వల్ల ఏర్పడే భూకంపాలతో నష్టం అపారంగా ఉంటుంది. ఇటీవల మెక్సికో దేశంలో రిక్టర్ స్కేల్ పై 6.5% భూకంపం వస్తేనే ఆ దేశం చిగురుటాకుల ఉనికిపోయింది. ఒకవేళ భూమి అంతర్గత పొరలోని క్రస్ట్ లో భారీ కదలిక ఏర్పడితే ఆ నష్టాన్ని అంచనా వేయలేమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సముద్రాన్ని కనుగొనే విషయంలో ప్రయోగాలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, రానున్న రోజుల్లో వీటిని విస్తృతం చేస్తే తప్ప ఒక అంచనాకు రాలేమని వారు అంటున్నారు. గతంలో సునామీ ఏర్పడినప్పుడు కూడా శాస్త్రవేత్తలు భూమిలో ఆరవ మహాసముద్రం దాగి ఉందని ఒక అంచనాకు వచ్చారు. కానీ ఆ దిశగా ప్రయోగాలు చేయకపోవడంతో అది అప్పట్లోనే మరుగున పడిపోయింది.
[…] […]