Ananya Panday: త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే, సెకెండ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ కి స్కోప్ ఉంది. ఈ పాత్రలోనే అనన్య పాండేను ఎంపిక చేసినట్లు రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రచారంపై అనన్య పాండే స్పందించింది. నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అభిమానం. అందుకే, నాకు మహేష్ బాబు సరసన నటించే అవకాశం వస్తే బాగుండు. అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది అనన్య.

లైగర్ సినిమా ప్లాప్ కారణంగా మొత్తానికి అనన్య పాండే కి ఉన్న క్రేజ్ కాస్త దొబ్బింది. అందుకే, ప్రస్తుతం మీడియా మీద పడింది. పిలవకపోయినా హిందీ మీడియా కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో అనన్య బోలెడు సంగతులు చెప్పింది. ‘నాకు ఎమోషన్ అంటే ఇష్టం అంటోంది. ఎమోషనల్ సీన్స్ లో నటించడం తనకు ఫేవరేట్ అంటుంది. నిజానికి ఎమోషన్ ను పండించడం చాలా కష్టం. ఎమోషన్ టైమింగ్ ఎదురుగా ఉన్న యాక్టర్ రియాక్షన్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే.. అనన్య పాండే ఎమోషనల్ సీన్స్ లో ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుందట.

అయినా హీరోలతో సన్నిహితంగా ఉండటంలో అనన్య పాండే తోపు అనుకోండి. తనకు ఇష్టమైన వాటి గురించి కూడా చెప్పింది. సినిమాలో అనన్య కి రొమాన్స్ కూడా బాగా ఇష్టం అట. కారణం.. రొమాన్స్ ను పడించడం తనకు చాలా తేలికైన పని అంటుంది. అందుకే.. హీరోలతో రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు అనన్య పాండే చాలా ఉత్సాహంగా ఉంటుందట. మొత్తానికి తన దృష్టిలో రొమాన్స్ చాలా ఈజీ అని తేల్చి చెప్పింది అనన్య పాండే.