Inaya Sultana Marriage: బిగ్ బాస్ సీజన్ 6లో అత్యంత ప్రభావం చూపిన కంటెస్టెంట్ గా ఇనయా నిలిచారు. ముక్కుసూటితనం, తప్పును ప్రశ్నించే గుణం, ఒంటరిగా పోరాడే తత్త్వం, బోల్డ్ యాటిట్యూడ్ ఇనయాను ప్రత్యేకంగా నిలిపాయి. ఆమెకు లేడీ టైగర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఒక సామాన్యురాలిగా హౌస్లో అడుగుపెట్టిన ఇనయా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇనయా తమ ఫెవరేట్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో వేల మంది కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా రేసులోకి వచ్చిన ఇనయా ఎలిమినేషన్ అభిమానులను బాధపెట్టింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడమేంటి? ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. హౌస్లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కంటే ఇనయాకు తక్కువ ఓట్లు వచ్చాయంటే మేము నమ్మం. ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇనయా ఎలిమినేషన్ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఏది ఏమైనా హౌస్లో 14 వారాలు ఉండటం చిన్న విషయం కాదు. భారీ ఫేమ్, గుర్తింపు ఉన్న బాల ఆదిత్య, చలాకీ చంటి, పింకీ, ఫైమా వంటి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. వారితో పోల్చుకుంటే అసలు ఇనయా ఎవరో కూడా తెలియదు. కేవలం రామ్ గోపాల్ వర్మతో కనిపించి కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. నామినేషన్స్ లో ఉన్నప్పుడు వర్మ ఆమెకు సప్పోర్ట్ చేశారు. కాగా కీలక సమయంలో వదిలేశాడు. 14వ వారం ఎలిమినేషన్స్ లోకి వచ్చినప్పటికీ వర్మ ఆమె కోసం క్యాంపైన్ చేయలేదు.

ఇక ఇనయా పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వచ్చే వరకు ఆమెకు ఎలాంటి ఫేమ్ లేదు. ఈ క్రమంలో ఇనయాకు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యిందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పెళ్లికూతురిగా సిద్దమైవున్న ఇనయా ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటో ఆధారంగా చూపుతూ ఇనయాకు ఆల్రెడీ వివాహం జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ ఫోటోలో ఆమె పెళ్లి కూతురో కాదో స్పష్టత లేదు. అలాగే పక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. కేవలం ఒక ఫోటో ఆధారంగా పెళ్లి జరిగిందన్న నిర్ణయానికి రాలేమని కొట్టిపారేస్తున్నారు.