
Manchu Manoj Wishes Charan: మంచు బ్రదర్స్ మధ్య మంట రగులుతున్న వేళ స్వీట్ బ్రదర్ అంటూ మనోజ్ చేసిన ట్వీట్ షాక్ ఇచ్చింది. అది కాస్తా వైరల్ గా మారింది. ఇక్కడ మనోజ్ రామ్ చరణ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. నేడు చరణ్ బర్త్ డే నేపథ్యంలో మనోజ్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే మై స్వీట్ బ్రదర్. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీవు మరిన్ని అరుదైన విజయాలు సాధించాలి. గ్లోబల్ స్టార్ అంటూ… ట్వీట్ చేశారు. మంచు లక్ష్మి, రామ్ చరణ్ లతో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఒక ప్రక్క ఫ్యామిలీలో సీరియస్ మేటర్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
అందులోనూ మనోజ్ అక్కతో ఉన్న ఫోటో షేర్ చేశారు. ప్రత్యేకంగా మంచు లక్ష్మి కూడా ఉన్న ఫోటో ఎందుకు షేర్ చేయాలి. కేవలం తాను మాత్రమే చరణ్ తో ఉన్నది లేదా… విష్ణు కూడా ఉన్న ఫోటో పంచుకోవచ్చు కదా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంలో అక్క మంచు లక్ష్మి నావైపే అని చెప్పినట్లుగా ఉందని అంటున్నారు. నెటిజెన్స్ ఇలా కూడా ఆలోచిస్తున్నారు.
మనోజ్ ప్రేమించిన అమ్మాయి భూమా మౌనికతో మంచు లక్ష్మి వివాహం చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు ఈ పెళ్ళి విషయంలో అసహనం కలిగి ఉన్నారని క్లియర్ గా అర్థమైంది. అందుకే తమ్ముడి కోసం లక్ష్మి ముందుకు వచ్చింది. మార్చి 3న మనోజ్-మౌనికల వివాహం కాగా రెండు రోజులు ముందే వేడుకలు మొదలయ్యాయి. విష్ణు కానీ మోహన్ బాబు కానీ అటు వైపు తొంగి చూడలేదు. పెళ్లి రోజు విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెంటనే వెళ్లిపోయినట్లు సమాచారం.

మోహన్ బాబు మాత్రం పెళ్లి పందిరిలో పెద్దగా నిలబడ్డారు. పబ్లిక్ మేటర్ కావడంతో ఆయనకు తప్పలేదు. అసలు గొడవ మౌనికను వివాహం చేసుకుంటానన్న మనోజ్ నిర్ణయంతోనే మొదలైంది అనేది ఒక వాదన. కొందరు మాత్రం ఆస్తుల పంపకాలంటున్నారు. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ బాధ్యతలు మంచు విష్ణుకు అప్పగించారట. మోహన్ బాబు కుటుంబానికి ఆదాయం సమకూర్చే అతిపెద్ద మార్గం ఆ విద్యాసంస్థలు. ఏది ఏమైనా మనోజ్ షేర్ చేసిన వీడియోతో గొడవలు రచ్చకెక్కాయి.
Wishing my sweetest brother and our very own #GlobalStar @AlwaysRamCharan a super duper happy birthday! 🎉
Really Proud of you Mithrama ❤️🤗
Wishing you many more amazing years ahead.. Lots of love. ❤️#HBDGlobalStarRamCharan pic.twitter.com/GZLBooJo9H— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 27, 2023