Rahul Sipliganj – Punarnavi : పునర్నవిని తల్లిని చేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్..? ఛీ ఛీ నన్ను ఇరికించొద్దంటూ!

Rahul Sipliganj – Punarnavi : బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ లో యాంకర్ శ్రీముఖితో పోటీపడ్డ రాహుల్ విజేతగా అవతరించాడు. కాగా ఈ సీజన్లో పునర్నవి భూపాలంతో ఆయన రొమాన్స్ హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో ప్రేమకథల ట్రెండ్ మొదలైంది వీరితోనే. తెలుగులో అంతకు ముందు జరిగిన రెండు సీజన్స్ లో ఎవరూ ప్రేమికులుగా పాపులర్ కాలేదు. పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్ పేర్లు గట్టిగా […]

Written By: NARESH, Updated On : April 6, 2023 8:27 am
Follow us on

Rahul Sipliganj – Punarnavi : బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ లో యాంకర్ శ్రీముఖితో పోటీపడ్డ రాహుల్ విజేతగా అవతరించాడు. కాగా ఈ సీజన్లో పునర్నవి భూపాలంతో ఆయన రొమాన్స్ హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లో ప్రేమకథల ట్రెండ్ మొదలైంది వీరితోనే. తెలుగులో అంతకు ముందు జరిగిన రెండు సీజన్స్ లో ఎవరూ ప్రేమికులుగా పాపులర్ కాలేదు. పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్ పేర్లు గట్టిగా వినిపించాయి.

ఎలిమినేటైన పునర్నవి రాహుల్ కోసం క్యాంపైన్ చేసింది. అతడు టైటిల్ అందుకోవడంలో తనవంతు సాయం చేసింది. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా కొన్నాళ్ళు వీరు సన్నిహితంగా ఉన్నారు. ఒక దశలో పెళ్లంటూ వార్తలు వచ్చాయి. అయితే కాలం గడిచే కొద్దీ మెల్లగా దూరమయ్యారు. పునర్నవి, రాహుల్ లవర్స్ అనే ఓ బ్రాండ్ నేమ్ అయితే గట్టిగా పడింది. ప్రస్తుతం లండన్ లో చదువుకుంటున్న పునర్నవి తల్లి అయ్యారనే ఓ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

ఈ వార్తలను పునర్నవి ఖండించారు. ఆమె ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ ని అడగ్గా… ఛీ ఛీ నన్ను ఇరికించకండి అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు. బిగ్ బాస్ షో తర్వాత అనేక హిట్ సాంగ్స్ పాడాను. బిజినెస్లు మొదలుపెట్టాను. నేను నా ప్రొఫెషన్ లో చాలా బిజీగా ఉన్నాను. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటాము. అంతకు మించి పునర్నవితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

అదే సీజన్లో పాల్గొన్న అషురెడ్డితో కూడా రాహుల్ సన్నిహితంగా ఉంటాడు. ఆమెతో ఉన్న బంధం మీద కూడా ఆయన స్పందించారు. అషురెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. తాను చాలా మంచి అమ్మాయి. తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. సహాయం చేస్తుంది. మా మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి వివరించి చెప్పాల్సిన అవసరం లేదని రాహుల్ అన్నాడు. ఇక పునర్నవి ఉయ్యాలా జంపాలాతో పాటు పలు చిత్రాల్లో నటించారు. సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చి లండన్ వెళ్లి పై చదువులు చదువుతుంది.