Singer Chinmayi vs Srihan బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్ ఆకతాయిగా చేసిన పని సింగర్ చిన్మయి అసహనానికి గురైంది. చిన్న పిల్లలతో ఇలా ప్రవర్తించి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అర్థం వచ్చేలా ఆమె స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సింగర్ చిన్మయి రెబల్ అన్ని విషయం తెలిసిందే. ఆమె ఫెమినిస్ట్ కూడాను. చాలా కాలంగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. సీనియర్ రైటర్ వైరముత్తుపై చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వైరముత్తు పలువురిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె ప్రధాన ఆరోపణ. ఇక సోషల్ మీడియా వేదికగా దేశంలో జరిగే అనుచిత సంఘటనల మీద ఆమె స్పందిస్తారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోని ఆమె తీవ్రంగా ఖండించారు. సింగర్ చిన్మయిని హర్ట్ చేసేలా ఆ వీడియో ఏముందో పరిశీలిస్తే… సిరి వద్ద ఒక కుర్రాడు పెరుగుతున్నాడు. ఆ పిల్లాడు సిరి మేనల్లుడని సమాచారం. చిన్నప్పటి నుండి ఆమె వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మమ్మీ అని పిలుస్తాడు. సిరి లవర్ శ్రీహాన్ ని డాడీ అని పిలుస్తాడు. కాగా ఆ బాలుడు శ్రీహాన్ చెప్పిన మాట వినలేదట. మరోసారి అలా చేయకుండా భయపెట్టాలి అనుకున్నాడు. దాని కోసం బెల్ట్ తీసుకొని తనని తాను బెల్టుతో కొట్టుకుంటూ పిల్లాడికి భయం చెబుతున్నాడు.
శ్రీహాన్ సెల్ఫ్ హర్ట్ చేసుకుంటుంటే పిల్లాడు ఏడుస్తున్నాడు. శ్రీహాన్ చర్య పిల్లాడి మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక చెడు ధోరణి వైపు నడిపిస్తుందని చిన్మయి అంటున్నారు. మన సమాజంలో పేరెంట్స్ పిల్లలు మాట వినకపోతే చనిపోతామని బెదిరిస్తారు. చదువు, పెళ్లి వంటి వ్యవహారాల్లో చెప్పిన మాట వినకపోతే ఏదో ఒకటి చేసుకుంటామని భయపెడతారు. ఈ దురాచారానికి చరమగీతం పాడాలి. అది జరగాలంటే బాల్యం నుండే బ్లాక్ మెయిలింగ్ కరెక్ట్ కాదని చెప్పాలి.
కానీ శ్రీహాన్ చర్య దాన్ని పిల్లల్లో ప్రోత్సహించేదిగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీహాన్ వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మరి చిన్మయి కామెంట్స్ కి శ్రీహాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ గా శ్రీహాన్ రూ. 45 లక్షల వరకు గెలుచుకున్నాడు. ఇటీవల లవర్ బర్త్ డే నేపథ్యంలో ఆమెకు ఒక రింగ్ కొన్నాడు. త్వరలో ఈ జంట వివాహం చేసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. చాలా కాలంగా శ్రీహాన్-సిరి రిలేషన్ లో ఉన్నారు.